E-Paper
Advertisement

Romantic Comedy OTT : లండన్ గల్లీలో లవ్ స్టోరీ… బ్రిటిష్ అమ్మాయితో బెంగాలీ అబ్బాయి ప్రేమ… చక్కిలి గింతలు పెట్టే స్టోరీ

Romantic Comedy OTT : లండన్ గల్లీలో లవ్ స్టోరీ… బ్రిటిష్ అమ్మాయితో బెంగాలీ అబ్బాయి ప్రేమ…  చక్కిలి గింతలు పెట్టే స్టోరీ
Advertisement

Romantic Comedy OTT :ఓటీటీలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొన్ని సినిమాలు భలే ఉంటాయి. ఈ సినిమాలు చూసేంత సేపు చూడచక్కగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాగే ఉంటుంది. ఇందులో తల్లిదండ్రుల సెంటిమెంట్, కామెడీ ట్రాక్ కలగలిసి ఉండటంతో ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ బెంగాలీ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బెంగాలీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘ఓగో బిదేశిని’ (Ogo Bideshini). ఈ సినిమాకు అన్షుమన్ ప్రత్యుష్ దర్శకత్వం వహించారు.
ఇందులో అంకుష్ హజ్రా, అలెగ్జాండ్రా టేలర్, మాన్సీ సిన్హా, శాంతిలాల్ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో అంకుష్ హజ్రా కథానాయకుడు అబ్రా పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతను లండన్‌లో ఉంటూ తన ప్రేమను ఇంట్లో చెప్పలేక ఇబ్బంది పడే కుర్రాడిగా కనిపిస్తారు. బ్రిటీష్ నటి అయిన అలెగ్జాండ్రా, అబ్రా ప్రేయసి సుజైన్ పాత్రలో నటించారు. ఈమె బెంగాలీ సంప్రదాయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించే సీన్స్ బాగా పండాయి. ఇక అబ్రా తల్లిగా మాన్సీ సిన్హా నటించారు. ఈమె పాత్ర ఇందులో చాలా కీలకం. సంప్రదాయాలు పాటించే ఒక సాధారణ బెంగాలీ తల్లిగా అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు జీత్ గంగూలీ సంగీతం అందించారు. ఈ మెలోడీ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2022 నవంబర్ 18న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం jio hotstar, prime videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లండన్‌లో సెటిల్ అయిన ఒక బెంగాలీ అబ్బాయి (అంకుష్), సుజైన్ (అలెగ్జాండ్రా) అనే బ్రిటిష్ అమ్మాయితో సీక్రెట్‌గా ప్రేమలో ఉంటాడు. అయితే తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని, అలాగే తన తల్లికి సంప్రదాయాలంటే చాలా గౌరవమని తెలిసి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడతాడు. తన ప్రేయసితో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తుంటాడు. కానీ ఒకరోజు ఊహించని విధంగా అతని తల్లిదండ్రులు ఇండియా నుండి లండన్ వచ్చేస్తారు. తన కొడుక్కి ఒక పద్ధతి గల బెంగాలీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అతని తల్లి పట్టుబడుతుంది. దాంతో ఆ అబ్బాయి తన బ్రిటీష్ ప్రేయసిని వాళ్లకు ఎలా పరిచయం చేయాలో తెలియక తలపట్టుకుంటాడు. ఇక్కడ నుండి కథలో కామెడీ మొదలవుతుంది. తన తల్లిదండ్రుల మనసు గెలుచుకోవడానికి, ఆ బ్రిటీష్ అమ్మాయి బెంగాలీ సంప్రదాయాలను, వంటకాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. భాష తెలియకపోయినా, పద్ధతులు వేరైనా ఆ కుటుంబంలో ఎలా కలిసిపోయింది? చివరకు ఆ తల్లిదండ్రులు ఒక విదేశీ అమ్మాయిని తమ కోడలిగా ఒప్పుకున్నారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : మనవళ్లకు కథలు చెప్పాల్సిన వయసులో ప్రేమ పాఠాలు… డెబ్బై ఏళ్ల వయసులో డ్యాన్స్ స్టెప్పులు

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×