E-Paper
Advertisement

Shoaib Akhtar On Pink ball: ఫుట్ పాత్ పైన జెర్సీలు కొంటారా ? PSL ఆడ‌కుండా ల‌బుషేన్ ను త‌రిమికొట్టండి

Shoaib Akhtar On Pink ball:  ఫుట్ పాత్ పైన జెర్సీలు కొంటారా ?  PSL ఆడ‌కుండా ల‌బుషేన్ ను త‌రిమికొట్టండి
Advertisement

Shoaib Akhtar On Pink ball:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament)  గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు ఎవరూ లేకుండానే నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కరాచీ అలాగే లాహోర్ వేదికగా జరుగుతోంది. అయితే, ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ సందర్భంగా లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ ( Lahore Qalandars vs  Hyderabad Kingsmen) మధ్య జరిగింది. అయితే ఈ సందర్భంగా వైట్ బంతి కాస్త పింక్ కలర్ లోకి మారిపోయింది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib akhtar ) స్పందించారు. ఫుట్ పాత్ పైన జెర్సీలు కొని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును బొంద పెట్టారని మొహ్సిన్ న‌ఖ్వీని ( Mohsin Naqvi ) ఉద్దేశించి ఫైర్ అయ్యారు. డబ్బులు లేని ఫ్రాంచైజీలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఛాన్స్ ఇచ్చినందుకు ముందుగా మొహ్సిన్ న‌ఖ్వీని తన్నాలి అంటూ రెచ్చిపోయారు అక్త‌ర్‌. PSLపై విమ‌ర్శ‌లు చేసినందుకు ల‌బుషేన్ ను పాకిస్తాన్ నుంచి త‌రిమికొట్టండంటూ పిలుపునిచ్చారు అక్త‌ర్.

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఫుట్ పాత్ పైన జెర్సీలు కొని PSLను బొంద పెడ‌తావా ?

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ సారి కొత్తగా వచ్చిన హైదరాబాద్ జ‌ట్టుకు సంబంధించిన జెర్సీలు వివాదంగా మారాయి. పింక్ రంగు ఉన్న ఈ జెర్సీల కారణంగా తెల్లటి బంతులు కూడా రంగు మారిపోయాయి. హైదరాబాద్ కింగ్స్ మెన్‌ జట్టు బౌలింగ్ చేసే క్రమంలో జెర్సీలకు బంతులు రుద్దడం కారణంగా రంగులు మారిపోయాయి. దీంతో తెల్లటి బంతులన్నీ పింక్ కలర్ లోకి మారాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ లబుషేన్ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త టోర్న‌మెంట్ ను తాను చూడ‌లేదంటూ సెటైర్లు పేల్చారు.

ల‌బుషేన్ ను త‌రిమికొట్టండి

అయితే ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫుట్ పాత్ పైన కొనుగోలు చేసిన జెర్సీలను హైదరాబాద్ కింగ్స్ మెన్‌ తీసుకువచ్చిందని మండిపడ్డారు. నాణ్యతలేని జెర్సీలు వేసుకోవడం వల్ల బంతులు కలర్ మారిపోయాయని ఫైర్ అయ్యారు. దీనివల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పరువు పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన ఓన‌ర్ల‌ను బండబూతులు తిట్టారు. డబ్బులు పెట్టలేని వాళ్లకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఛాన్స్ ఇవ్వకూడదని న‌ఖ్వీకి హితువు పలికారు షోయబ్ అక్తర్. ఇక హైదరాబాద్ కెప్టెన్ లబుషేన్ పైన ( Marnus Labuschagne ) కూడా మండిపడ్డారు. బంతులు పింక్ కలర్ లోకి మారిన తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ పైన లబుషేన్ మీడియా ముందు బురద జల్లాడని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడుతూ మ‌న‌ల్ని విమర్శలు చేసే వాళ్లను కూడా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

 

 

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×