E-Paper
Advertisement

Romantic movie OTT: అందం కోసం ఆరాటం… ఇద్దరబ్బాయిల ప్రేమలో అమ్మాయి… ఓటీటీలోకి సరికొత్త ప్రేమ కథ

Romantic movie OTT: అందం కోసం ఆరాటం… ఇద్దరబ్బాయిల ప్రేమలో అమ్మాయి… ఓటీటీలోకి సరికొత్త ప్రేమ కథ
Advertisement

Romantic movie OTT : ఓటీటీలో మరో కొరియన్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఆడియన్స్ తెగ చూస్తున్నారు కూడా. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య సాగే ఈ స్టోరీ నిజంగానే చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమికులే కాదు, అందరూ చూడాల్సిన రొమాంటిక్ డ్రామా సినిమా ఇది. చూశాక మరొక్క సారి చూడాలనిపిస్తుంది ఈ రొమాంటిక్ డ్రామాని. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ 

ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా చిత్రం పేరు ‘పవానే’ (Pavane). దీనికి లీ జోంగ్-పిల్ దర్శకత్వం వహించారు. ఇందులో గో అహ్-సంగ్, బ్యూన్ యో-హాన్ మరియు మూన్ సంగ్-మిన్ నటించారు. ఈ చిత్రం రచయిత పార్క్ మిన్-గ్యు రాసిన పవానే ఫర్ ఎ డెడ్ ప్రిన్సెస్ నవల ఆధారంగా రూపొందింది. ఇది 2026 ఫిబ్రవరి 20న నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదలైంది. ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ ను సినిమా హాల్స్‌లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లోనే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1980ల కాలం నాటి సియోల్ నగరంలో మి-జియోంగ్ అనే యువతి, ఒక పెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో పని చేస్తూ ఉంటుంది. ఆమె అంత అందంగా లేకపోవడంతో అందరూ ఆమెను తక్కువ చేసి చూస్తుంటారు. దీనివల్ల ఆమె ఎప్పుడూ ఒంటరిగా, నలుగురిలోకి రావడానికి భయపడుతూ స్టోర్ బేస్‌మెంట్‌లోనే గడుపుతుంటుంది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి గ్యోంగ్-రోక్ అనే యువకుడు వస్తాడు. అతను ఆమె రూపం కంటే ఆమె స్వచ్చమైన మనసును ఇష్టపడతాడు. ఆమెలో కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తాడు. ఇంతలో వీళ్ళకి తోడుగా యో-హాన్ అనే మరో స్నేహితుడు కూడా చేరతాడు. ఈ ముగ్గురు కలిసి సమాజం పెట్టే కష్టాలను, తమ జీవితాలలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ కొరియన్ రొమాంటిక్ మిగిలిన కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ఒక మంచి మెలోడ్రామాగా పేరు తెచ్చుకుంది.

Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×