Romantic Movie OTT : ఫిలిప్పీన్స్ రొమాంటిక్ సినిమాలలో ఘాటుగా ఉండే సరసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఏ మాత్రం మొహమాటం లేకుండా అలాంటి సీన్లు తీయడంలో అక్కడి వాళ్ళు ఒక అడుగు ముందే ఉంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో బోల్డ్ కంటెంట్ బోలెడంత ఉంటుంది. ఒక ఆడపిల్ల మీద ఉండే పిచ్చి ప్రేమ కాస్తా ఉన్మాదంగా మారి, ఒక మనిషి ఎంతటి రాక్షసుడిలా మారతాడో ఇందులో చూపించారు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది గ్లామర్, హింస కలగలిసిన ఒక సైకో లవ్ స్టోరీ. ఒంటరిగా చూడాల్సిన సినిమా కూడా.
ఈ ఫిలిప్పీన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సలాకాబ్’ (Salakab). 2023లో వచ్చిన ఈ సినిమాకు రోమన్ పెరెజ్ జూనియర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఏంజెలీ ఖాంగ్ (లెనా), బెంజ్ సంగలాంగ్ (ఆర్థర్), జోమారి ఏంజెల్స్ (ఒంజీ) లీడ్ రోల్స్ లో నటించారు.ఈ సినిమా ప్రధానంగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ వివామ్యాక్స్ (Vivamax) కోసం రూపొందింది. ఇందులో నటించిన ఏంజెలీ ఖాంగ్ ఆ దేశంలో బోల్డ్ సినిమాలకు చాలా ఫేమస్. దర్శకుడు రోమన్ పెరెజ్ జూనియర్ ఈ చిత్రాన్ని చాలా డార్క్‌గా, మనుషుల మధ్య ఉండే అసూయ, పగ వంటి అంశాలను హైలైట్ చేస్తూ తీశారు. ఇది కేవలం పెద్దలకు మాత్రమే.
లెనా అనే అమ్మాయి పట్నంలో చదువు పూర్తి చేసుకుని తన సొంతూరికి తిరిగి వస్తుంది. అక్కడ ఆమె పాత ప్రేమికుడు ఆర్థర్ ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య వ్యవహారం మళ్లీ మొదలవుతుంది. అయితే లెనా పట్నంలో ఉన్నప్పుడు ఒంజీ అనే వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుంటుంది. ఆ విషయం తెలియక ఆర్థర్ ఆమెను పిచ్చిగా ప్రేమిస్తుంటాడు. కానీ అసలు విషయం మెల్లగా బయటపడుతుంది. లెనాకు పట్నంలో మరొకడు ఉన్నాడని తెలియగానే ఆర్థర్‌కు పిచ్చెక్కిపోతుంది. అసూయతో రగిలిపోయి, ఆమెను తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. అటు పాత ప్రియుడు, ఇటు కొత్త ప్రేమికుడి మధ్య లెనా జీవితం ఒక ఉచ్చు లాగా తయారవుతుంది. చివరికి ఈ ప్రేమ వ్యవహారం కాస్తా పగ, ప్రతీకారాలుగా మారుతుంది. ఆర్థర్ ఉన్మాదంతో లెనాను బంధించడం, ఆమెను చిత్రహింసలు పెడుతూ అనుభవించడం చుట్టూ కథ తిరుగుతుంది. చివరకు ఆ నరకం నుండి ఆమె ఎలా బయటపడింది ? ఆమె ఎవరితో అడుగులు వేస్తుంది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మార్చురీ నుండి మాయమైన మృతదేహం…క్లైమాక్స్ లో ఊహించని షాకింగ్ ట్విస్ట్… ఐయండిబిలో 7.6 రేటింగ్