E-Paper
Advertisement

ఆమె కౌగిలిలో చిక్కితే ప్రాణాలు గాల్లోనే… ఈ సినిమా సింగిల్స్ కి మాత్రమే

ఆమె కౌగిలిలో చిక్కితే ప్రాణాలు గాల్లోనే… ఈ సినిమా సింగిల్స్ కి మాత్రమే
Advertisement

Romantic Movie on OTT: ఓటీటీలో ఒక అదిరిపోయే రొమాంటిక్ ఉంది. అయితే ఇది ఒక పాత కాలపు జానపద కథకు మసాలా అద్ది తీసిన పెద్దల సినిమా. అంటే ఇందులో బోల్డ్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఒక అందమైన మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమెకు శృంగార కోరికలు విపరీతంగా ఉంటాయి. ఆమెకున్న ఈ స్వభావం వల్ల ఊరిలోని మగవాళ్ళు తట్టుకోలేక చచ్చి పోతుంటారు. ఈ క్రమంలో అడవిలో ఒక మొరటు వ్యక్తిని కలవడం.. వాళ్ళ మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాల చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. అయితే ఇది కుటుంబంతో కలిసి చూసే సినిమా కాదు. ఒంటరిగా చూడటమే మంచిది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది స్టోరీ ఆఫ్ ఓంగ్-న్యో’ (The Story of Ong-nyeo). దీనిని క్యోంగ్ సియోక్-హో దర్శకత్వంలో 2014లో విడుదల చేశారు. దాదాపు 94 నిమిషాల నిడివి గల ఈ సినిమాకి కొరియాలో ‘A’ (18+) రేటింగ్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ హాన్ చే-యూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఏషియన్ క్రష్ వంటి సంస్థలు ఈ సినిమా డిస్ట్రబ్యూట్ చేశాయి. ఇది కొరియన్ జానపద కథల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా Google Play Moviesలో అద్దెకు తీసుకోవచ్చు. Plexలో కూడా ఇది అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఓంగ్-న్యో అంటే మామూలు అందగత్తె కాదు, ఆమెను చూస్తే ఏ మగాడైనా తలతిప్పి చూడాల్సిందే. అయితే ఆమెకు ఒంట్లో విపరీతమైన కోరికలు ఉంటాయి. ఆ వేడి తట్టుకోలేక ఆమెతో గడిపిన మగాళ్ళంతా ఒక్కొక్కరుగా ప్రాణాలు వదిలేస్తారు. ఊర్లో వాళ్లంతా ఆమెను ఒక శాపంగా చూస్తుంటారు. దీనివల్ల ఆమెను ఒక అపశకునంగా భావించి అందరూ దూరం పెడతారు. చివరకు చేసేదేమీ లేక ఆమె ఊరు విడిచి అడవుల్లో ఒంటరిగా జీవించడం మొదలుపెడుతుంది. అదే సమయంలో బ్యోన్ గాంగ్-సో అనే వ్యక్తి కూడా తన వింత ప్రవర్తన వల్ల ఊరి నుండి వెలివేస్తారు. అతను శారీరకంగా చాలా బలవంతుడు. విధివశాత్తూ అడవిలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. లోకమంతా ఓంగ్-న్యోను చూసి భయపడితే, అతను మాత్రం ఆమెలోని అసలు మనిషిని ప్రేమిస్తాడు. చివరికి అందరూ భయపడే ఓంగ్-న్యో కోరికను ఆ మొరటు వ్యక్తి తట్టుకున్నాడా ? ఆ అడవిలో వీళ్లిద్దరూ కలిసి ఎలాంటి రచ్చ చేశారు అనేదే మిగతా స్టోరీ.

Read Also : మౌనంగా మొదలై మనసుల్ని గెలిచిన ప్రేమ… స్క్రీన్ మీద మెరిసిన విజువల్ వండర్… ఐయండిబిలో 8 రేటింగ్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×