E-Paper
Advertisement

Shahid Afridi: PSLలో ఆడాలంటే, రోహిత్ శ‌ర్మ క‌చ్చితంగా పాకిస్థాన్‌ బీఫ్ తినాల్సిందే

Shahid Afridi: PSLలో ఆడాలంటే, రోహిత్ శ‌ర్మ క‌చ్చితంగా పాకిస్థాన్‌ బీఫ్ తినాల్సిందే
Advertisement

Shahid Afridi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కొనసాగుతోంది. అయితే ప్రేక్షకులు లేకుండానే సాగుతున్న PSL కు హైప్ ఇచ్చేందుకు మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమ టోర్నమెంటు పెద్దదంటే పెద్దది అంటూ విర్రవీగుతున్నారు. అలాగే టీమిండియా సీనియర్ క్రికెటర్లకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. PSL లోకి రావాలని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలనుకుంటే రోహిత్ శర్మకు ( Rohit Sharma) అవకాశం ఇస్తామని అన్నారు. కానీ పాకిస్తాన్ బీఫ్ తింటేనే, త‌మ దేశంలో అడుగుపెట్టనిస్తామని కండిషన్ పెట్టారు షాహిద్ అఫ్రిది. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక అతడు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ గానే కౌంటర్స్ ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు లోకి రావాల్సిన దుస్థితి రోహిత్ శర్మకు రాలేదని కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

పాకిస్తాన్ లో ఆడాలంటే బీఫ్ తినాల్సిందే… రోహిత్ శర్మకు కండిషన్లు

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. దీని ఎఫెక్ట్ క్రికెట్ పైన కూడా పడింది. దీని ఫలితంగా ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు కాగా.. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లో మాత్రమే టీమిండియా అలాగే పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే తరచూ టీం ఇండియాను గెలకడం మాత్రం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తగ్గించుకోవడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఫిక్సింగ్ జరుగుతోందని.. ఐపీఎల్ లో ఉన్న వాళ్లంతా దొంగలే అంటూ తన్వీర్ అహ్మద్ ఇలాంటి క్రికెటర్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో పాకిస్తాన్ లో ఆడేందుకు రోహిత్ శర్మ రావాలని షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ఆడాలనుకుంటే రోహిత్ శర్మ వెంటనే రావచ్చునని ఆఫర్ ఇచ్చారు. అయితే పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే, పాకిస్తానీ బీఫ్ కబాబ్స్ ( Pakistani beef kebabs) తినాల్సిందేనని కండిషన్ పెట్టారు. పాకిస్తాన్ బీఫ్ తింటేనే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని వెల్లడించారు షాహిద్ అఫ్రిది. దీంతో అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ముస్లిం మతంలోకి మారాలంటూ కోహ్లీకి ఆఫర్లు

Advertisement

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి కూడా పాకిస్తాన్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రావాలని విరాట్ కోహ్లీకి తాజాగా ఇంజమామ్ ఆఫర్ ఇచ్చారు. పాకిస్తాన్ లో హిందూ క్రికెటర్లకు అవకాశం లేదని.. మతం మార్చుకోవాల్సిందేనని తెలిపారు. ఇస్లాం మతంలోకి విరాట్ కోహ్లీ కన్వర్ట్ అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఆడే అవకాశం ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×