Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. ఏమాత్రం కంటెంట్ కొత్తగా అనిపించినా, ఆ సినిమాలు హిట్ అవ్వడం పక్కా. ఆడియన్స్ ఆ సినిమాలను తెగ చూస్తారు కూడా. అలాంటి సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయిపై పగ పెంచుకుంటాడు ఓ ప్రేమికుడు. ఆ రివేంజ్ కూడా చూడ చక్కగా ఉంటుంది. ఈ సినిమా ఫిలిప్పీన్ లో తెగ హిట్ అయింది. కాసుల వర్షమే కురిపించింది ఈ స్టోరీ. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ మూవీపై ఓ లుక్ వేయండి. క్లైమాక్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఈ ఫిలిప్పీన్స్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘అన్/హ్యాపీ ఫర్ యూ’ (Un/Happy for You). ఇందులో జువాంచో పాత్రలో జోషువా, జీ పాత్రలో జూలియా నటించారు. నిజానికి హీరో జోషువా, హీరోయిన్ జూలియా నిజ జీవితంలో కూడా ఒకప్పుడు ప్రేమించుకున్నారు. వాళ్ళు విడిపోయిన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలైన స్టార్ సినిమా, వివా ఫిల్మ్స్ కలిసి నిర్మించాయి. 2024 ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
హీరో జువాంచో అనే ఊర్లో ఒక మంచి పేరున్న చెఫ్. వంటలు అదరగొడుతుంటాడు. కానీ మనసులో మాత్రం పాత లవర్ జీ మీద పిచ్చ కోపం, కసితో ఉంటాడు. ఎందుకంటే నాలుగేళ్ల క్రితం ఆమె ఇతన్ని నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయింది. కట్ చేస్తే, ఒకరోజు సడన్‌గా ఆమె మళ్లీ ఊర్లోకి దిగుతుంది. అది కూడా వేరే వాడితో ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని చెప్పడానికి! అది విన్న జువాంచో కి మైండ్ బ్లాక్ అయిపోయి, ఎలాగైనా ఆమె మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ వేస్తాడు. రివెంజ్ అంటే మామూలుగా కాదు, ఆమెను మళ్లీ తన ప్రేమలో పడేసి, సరిగ్గా పెళ్లి టైంకి హ్యాండ్ ఇచ్చి పాత బాకీ తీర్చుకోవాలని జువాంచో స్కెచ్ వేస్తాడు.
ఇందుకోసం ఆమె చుట్టూ తిరుగుతూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తెగ యాక్టింగ్ చేస్తాడు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే.. ఆమెతో గడుపుతున్న కొద్దీ, ఇతను వేసిన ప్లాన్ రివర్స్ కొట్టి, నిజంగానే మళ్లీ ఆమె మాయలో పడిపోతాడు. అప్పుడే వాళ్ళిద్దరూ అప్పట్లో ఎందుకు విడిపోయారో, ఆ గొడవ వెనుక ఉన్న అసలు కారణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరకు జువాంచోకి ఒక విషయం అర్థమవుతుంది. ప్రేమించిన వాళ్ల మీద కసి తీర్చుకోవడం కంటే, వాళ్లని మనస్ఫూర్తిగా క్షమించి పంపించేయడమే అసలైన విజయం అని. క్లైమాక్స్‌లో వాళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, పాత బాధలన్నీ వదిలేసి ప్రశాంతంగా విడిపోతారు. అందుకే ఈ సినిమాకి Un/Happy for You అని పేరు పెట్టారు.
Read Also : ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న స్టోరీ… కన్నీళ్లు పెట్టించే కజిన్స్… ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా