E-Paper
Advertisement

Feel Good Movie OTT : ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న స్టోరీ… కన్నీళ్లు పెట్టించే కజిన్స్… ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా

Feel Good Movie OTT : ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న స్టోరీ… కన్నీళ్లు పెట్టించే కజిన్స్… ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా
Advertisement

Feel good Movie OTT : హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎమ్మా స్టోన్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ‘ఫ్రూట్ ట్రీ’ ద్వారా ఒక చిన్న బడ్జెట్ సినిమాను నిర్మించింది. అయితే అది గ్లోబల్ లెవల్‌ లో ప్రశంసలు అందుకుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా క్రిటిక్స్ నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ఇందులో ఒక నిమిషం నవ్విస్తూ, మరుసటి నిమిషమే ఏడిపించేలా నటించిన కీరన్ కల్కిన్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఫిదా అయ్యారు. అందుకే ఆయనకు ఈ ఏడాది ఆస్కార్ (Best Supporting Actor) అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు హర్ట్ కి మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘ఏ రియల్ పైన్’ (A Real Pain). ఇందులో జెస్సీ ఐసెన్‌బర్గ్, కీరన్ కల్కిన్, జెన్నిఫర్ గ్రే లీడ్ రోల్స్ లో నటించారు. జెస్సీ ఐసెన్‌బర్గ్ హీరోగా, దర్శకుడిగా ఈ సినిమాలో తన సత్తా చాటాడు. అయితే సినిమా మొత్తం కీరన్ కల్కిన్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన ఇందులో ‘బెంజీ’ అనే క్యారెక్టర్‌లో జీవించేశాడు. ఈ సినిమాకు గాను ఆస్కార్ (Best Supporting Actor), గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఇది 2024 జనవరిలో సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. నవంబర్ 2024లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో Hulu, ఇండియాలో Jio hotstarలో అందుబాటులో ఉంది..

స్టోరీలోకి వెళ్తే

Advertisement

డేవిడ్ (జెస్సీ ఐసెన్‌బర్గ్) బెంజీ (కీరన్ కల్కిన్) అనే ఇద్దరు కజిన్స్ ఉంటారు. డేవిడ్ చాలా పద్ధతిగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయిన టైపు. కానీ బెంజీ మాత్రం కొంచెం తేడా.. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు, కానీ అందరితో ఇట్టే కలిసిపోతాడు. వీళ్ళిద్దరూ కలిసి తమ చనిపోయిన అమ్మమ్మ జ్ఞాపకార్థం పోలాండ్ దేశానికి ట్రిప్ వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మూలాలను వెతుక్కుంటూ ఒక టూరిస్ట్ గ్రూపుతో కలిసి ప్రయాణం మొదలుపెడతారు. ట్రిప్ మొదలైనప్పటి నుండి బెంజీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ట్రైన్లలో టికెట్ తీసుకోకుండా వెళ్దామని గోల చేయడం, గ్రూపులో ఉన్న అందరినీ తన మాటలతో బురిడీ కొట్టించడం చేస్తుంటాడు.

ఇది చూసి డేవిడ్‌కి చిరాకు వస్తుంది. ఒక పక్క తమ పూర్వీకులు అనుభవించిన కష్టాలు, ఆ హోలోకాస్ట్ (యూదుల ఊచకోత) జరిగిన ప్రదేశాలు చూస్తూ వీళ్ళు ఎమోషనల్ అవుతుంటే, మరోపక్క బెంజీ ప్రవర్తన వల్ల డేవిడ్‌కి పిచ్చెక్కుతుంది. అసలు కథ ఏంటంటే.. బెంజీ లోపల ఏదో పెద్ద బాధ ఉంటుంది, దాన్ని దాచుకోవడానికే వాడు అలా పిచ్చి పనులు చేస్తుంటాడు. బెంజీ ఏ విషయంలో బాధపడుతుంటాడు ? దానిని ఎలా అధిగమిస్తాడు ? ఈ రోడ్ ట్రిప్ వాళ్ళకు నేర్పింది ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫీల్ గుడ్ సినిమాపై ఓ లుక్ వేయండి.

Advertisement

Read Also : గుండెను మెలిపెట్టే స్టోరీ… ప్రెసిడెంట్ కోరిక కోసం తిప్పలు పడే చిన్నారి… ఎన్నో అవార్డులు గెలిచిన స్టోరీ

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×