Romantic Comedy Movie OTT : యూత్ ని ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు అట్రాక్ట్ చేస్తుంటాయి. ఈ జోనర్ లో రకరకాల సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీలు వీటికి భిన్నంగా ఉంటాయి. అందులోనూ కామెడీ కంటెంట్ తో వచ్చే రొమాంటిక్ స్టోరీలైతే మరింత మజా ఇస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఈ నేపథ్యంలోనే వచ్చింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపే విధానం ఇందులో నవ్వు తెప్పిస్తూ ఉంటుంది.
ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘స్నాక్ షాక్’ (Snack Shack). ఆడమ్ కార్టర్ రెహ్మీర్ దీనికి రచన, దర్శకత్వం వహించారు. ఇందులో కానర్ షెరీ (ఏజే), గాబ్రియేల్ లాబెల్లె (మూస్), మికా అబ్దల్లా (బ్రూక్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 మార్చి 15న రిపబ్లిక్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ (Jio hotstar)లో అందుబాటులో ఉంది.
1991 కాలం నాటి ఒక సిటీలో ఏజే, మూస్ అని ఇద్దరు స్నేహితులు ఉంటారు. వీళ్లకి చదువు కంటే బయట తిరుగుళ్లే ఎక్కువ. కుక్కల రేసుల మీద బెట్టింగులు వేయడం, ఇంట్లోనే దొంగచాటుగా బీర్లు తయారు చేసి అమ్మడం లాంటి పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు. ఎలాగైనా పైసలు సంపాదించాలని ప్లాన్ వేసి, చివరికి లోకల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న పాత స్నాక్ షాక్ క్యాంటీన్ కాంట్రాక్ట్ కొట్టేస్తారు. అక్కడ బర్గర్లు, చిరుతిళ్లు అమ్ముతూ మంచిగా గల్లా నింపుకుందామని ఫిక్స్ అవుతారు.
అయితే సీన్ లోకి బ్రూక్ అనే ఒక అందమైన పిల్ల ఎంట్రీ ఇస్తుంది. ఆమె అక్కడ లైఫ్ గార్డ్‌గా జాయిన్ అవుతుంది. ఆ పిల్లని చూడగానే ఈ ఇద్దరు దోస్తులకి బుర్ర పని చేయదు. ఇద్దరూ ఆమె వెనక పడటం స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా నీ కోసం ప్రాణమిస్తా అనుకునే ఈ ఫ్రెండ్స్ మధ్యలో, ఆ అమ్మాయి వల్ల గొడవలు మొదలై అది కాస్తా వీళ్ల స్నేహానికే ఎసరు పెడుతుంది. చివరికి ఆ ఆమ్మాయి ఎవరికి దక్కుతుంది ? ఈ ఇద్దరు స్నేహితులు మళ్లీ కలుస్తారా ? ఈ ట్రయాంగిల్ ప్రేమ కథకు ముగింపు ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : టీనేజ్ వయసులో ప్రేమ…10 ఏళ్ల తర్వాత షాకింగ్ ట్విస్టులు… లవర్స్ చూడాల్సిన స్టోరీ