E-Paper
Advertisement

18 ఏళ్ల యువకుడితో యవ్వారం నడిపే స్కూల్ టీచర్… రచ్చ రంబోలా సీన్లు ఉన్న సినిమా మావా

18 ఏళ్ల యువకుడితో యవ్వారం నడిపే స్కూల్ టీచర్… రచ్చ రంబోలా సీన్లు ఉన్న సినిమా మావా
Advertisement

Romantic thriller movie on OTT : గత ఏడాది వచ్చిన ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. పైకి పద్ధతిగా కనిపిస్తూ లోపల కోరికలతో రగిలిపోయే ఒక మహిళ, ఒక కుర్రాడిని కాపాడే ముసుగులో ఇంట్లోనే పెట్టుకుని నడిపే సీక్రెట్ అఫైర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మొదట్లో స్టోరీ కూల్‌గా సాగినట్లు అనిపించినా, ఒక్కసారి వాళ్ల మధ్య సీక్రెట్ బయటపడే టైమ్‌కి సీన్ మొత్తం రివర్స్ అయిపోయి రచ్చ రంబోలా అవుతుంది. జాలి, కామం, స్వార్థంతో ఒకరినొకరు వాడుకుంటూ, నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠతో సినిమాను ఊహించని రేంజ్‌కి తీసుకెళ్తాయి. కూల్‌గా ఉంటూనే మైండ్ బ్లాక్ చేసే సైకో థ్రిల్లర్లని ఇష్టపడేటోళ్లకు ఇది ఒక రేంజ్ లో నచ్చుతుంది. అయితే సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే దీనిని ఒంటరిగా చూడటమే మంచిది.

ఎక్కడ చూడచ్చుఅంటే

2025లో విడుదలైన ఈ నార్వేజియన్ రొమాంటిక్ థ్రిల్లర్ movie పేరు ‘డోంట్ కాల్ మీ మామ’ (Don’t Call Me Mama). దీనికి నీనా క్నాగ్ దర్శకత్వం వహించారు. 108 నిమిషాల ఈ సినిమా 2025 అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం 59వ కార్లోవీ వారీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో అద్భుత నటనకు గాను ప్రధాన నటి పియా త్జెల్టా ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఈ నార్వేజియన్ థ్రిల్లర్ మూవీ Apple TV ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఇదే పేరుతో 2025లో వచ్చిన ఒక కొరియన్ డ్రామా సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో ట్రెండ్ అవుతుండటంతో, ప్రేక్షకులు వెతికేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇవా ఒక పేరున్న హైస్కూల్ టీచర్. ఆమె భర్త జోస్టెయిన్ ఆ ఊరి మేయర్ కావడంతో సమాజంలో ఆమెకు మంచి గౌరవం ఉంటుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో భర్త నుండి తీవ్రమైన నమ్మకద్రోహాన్ని ఎదుర్కొంటుంది. ఆ బాధను మర్చిపోవడానికి, అలాగే తన భర్త రాబోయే రాజకీయ ఎన్నికల ప్రచారానికి ఒక మంచి ఇమేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఆమె ఒక స్థానిక వలసదారుల శరణార్థి కేంద్రంలో వాలంటీర్‌గా చేరి సేవలు చేయడం ప్రారంభిస్తుంది. అక్కడ ఆమెకు అమీర్ అనే 18 ఏళ్ల శరణార్థి యువకుడు పరిచయమవుతాడు. అతనిలోని అద్భుతమైన కవితా ప్రతిభ ఇవాను బాగా ఆకట్టుకుంటాయి.

అదే సమయంలో అమీర్ దరఖాస్తు తిరస్కరణకు గురై, అధికారులు అతన్ని దేశం నుండి పంపించేయడానికి సిద్ధమవుతున్నారని ఇవాకు తెలుస్తుంది. అతన్ని ఎలాగైనా కాపాడాలనే తాపత్రయంతో, ఆమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా అతనికి తన సొంత ఇంట్లోనే ఆశ్రయం ఇస్తుంది. ఆ ఒంటరితనంలో వారిద్దరి మధ్య ఉన్న బంధం కాస్తా హద్దులు దాటి, ఒక ప్రమాదకరమైన ప్రేమాయణంగా మారుతుంది. సమాజంలో తనకు ఉన్న హోదాను, భర్త రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఇవా ఆ కుర్రాడితో రహస్య జీవితాన్ని గడుపుతుంది. ఈ విషయం బర్తకు తెలియడంతో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : తల్లి మిస్సింగ్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు… డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×