E-Paper
Advertisement

Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!

Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!
Advertisement

Tea Powder: దారుణం.. ప్రస్తుత కాలంలో ఎక్కడ ఏం తినాలన్నా.. ఏమైనా కొనాలన్నా.. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిన్నపిల్లవాడు తాగే పాల నుంచి ప్రతి ఒక్కటి కల్తీ అవుతుంది. నిన్నటి వరకు కల్తీ పాల గురించి చర్చ జరిగింది.. ఇప్పుడు, కొత్తగా వెలుగులోకి టీ పౌడర్ వచ్చింది. అయితే హైదరాబాద్ నగరంలో మరోసారి కల్తీ మాఫియా పడగ విప్పింది. సామాన్యులు ఉదయాన్నే ఎంతో ఇష్టంగా తాగే టీ పొడిని కూడా విషతుల్యం చేస్తున్నారు.. ఇలా చేస్తున్న ఒక ముఠాను వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్ గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ నకిలీ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నాణ్యత లేని ముడి పదార్థాలతో పాటు ప్రమాదకరమైన సింథటిక్ రసాయనాలను వాడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.

ఈ కల్తీ ప్రక్రియ అత్యంత భయంకరంగా సాగుతోంది. నిందితుడు ఒక కిలో నకిలీ టీ పొడిని తయారు చేయడానికి కేవలం 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్‌ను, మరో 500 గ్రాముల నాసిరకం టీ గ్రాన్యూల్స్‌ను ఉపయోగిస్తున్నాడు. వీటికి అదనంగా, కంటికి ఇంపుగా కనిపించడానికి, టీకి చిక్కదనం తీసుకురావడానికి సుమారు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి)ని మిక్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

ఈ తయారీలో వాడుతున్న సింథటిక్ రంగులు, రసాయనాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ నకిలీ టీ పొడి వాడకం వల్ల కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తక్కువ ధరకు వస్తుందని అపరిచిత బ్రాండ్లను నమ్మి ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం, భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కల్తీ పొడిని, రసాయనాలను స్వాధీనం చేసుకుంది. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Also Read: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష.. ఈ సారీ జరిగే మార్పులివే..!

ప్రజలు ప్యాక్ చేసిన టీ పొడిని కొనుగోలు చేసేటప్పుడు గరిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీ పొడిని నీళ్లలో వేసినప్పుడు అది వెంటనే ముదురు రంగులోకి మారితే అందులో కృత్రిమ రంగులు ఉన్నట్లు అనుమానించాలి. అనుమతి లేని, సరైన లేబులింగ్ లేని ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పోలీసులు, ఆహార భద్రతా విభాగం హెచ్చరిస్తోంది.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×