E-Paper
Advertisement

Romantic web Series OTT : ముసుగు సుందరిని ప్రేమించే కోటీశ్వరుడు… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ

Romantic web Series OTT : ముసుగు సుందరిని ప్రేమించే కోటీశ్వరుడు… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ
Advertisement

Romantic web Series OTT : ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ ‘బ్రిడ్జర్టన్’ సీజన్ 4 వచ్చేసింది. ఇది ఫ్యాన్స్‌కి మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆడియన్స్ ఈ రొమాంటిక్ సిరీస్ ని తెగ చూస్తున్నారు. అందుకే ఇప్పటికే వచ్చిన మూడు సీజన్లు కూడా హిట్ అయ్యాయి. ఈ సీజన్ కథ మొత్తం బ్రిడ్జర్టన్ కుటుంబంలోని రెండో కుమారుడు బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్, సోఫీ బేక్ ల ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది. మరి ఈ సిరీస్ ని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’ (Bridgerton Season 4)ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రెండు పార్ట్స్‌గా వచ్చింది. పార్ట్ 1, 2026 జనవరి 29న 4 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయింది. ఇక పార్ట్ 2 ఫిబ్రవరి 26 రిలీజ్ అవ్వబోతోంది. టోటల్ 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సీజన్ పూర్తిగా బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ ప్రేమ కథ మీద ఫోకస్ చేస్తుంది. జూలియా క్విన్ రాసిన ‘యాన్ ఆఫర్ ఫ్రమ్ ఎ జెంటిల్‌మెన్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సీజన్ రూపొందింది. బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్‌గా ల్యూక్ థాంప్సన్, సోఫీ బేక్‌గా యెరిన్ హా ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’ కథ అంతా ఆ కుటుంబంలోని రెండో కుమారుడైన బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ చుట్టూ తిరుగుతుంది. ముఖానికి ముసుగు ధరించిన ఒక అమ్మాయిని చూసి అతను తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమె ఎవరో తెలుసుకునే లోపే, అర్ధరాత్రి వేళ అక్కడ నుండి మాయమవుతుంది. ఆ సుందరి మరెవరో కాదు, తన సవతి తల్లి పెట్టే కష్టాలను భరిస్తూ పనిమనిషిగా బతుకుతున్న సోఫీ బేక్. ఇక బెనెడిక్ట్ ఆ ముసుగు వెనుక ఉన్న అమ్మాయి కోసం వెతకడం చుట్టూ ఈ సీజన్ నడుస్తుంది.

కథ ముందుకు సాగే కొద్దీ, బెనెడిక్ట్ ఒక ప్రమాదం నుండి సోఫీని రక్షించి ఆమెకు తన ఇంట్లోనే పని కల్పిస్తాడు. అయితే తను ప్రేమిస్తున్న ముసుగు సుందరి, ఇప్పుడు తన కళ్లముందు ఉన్న పనిమనిషి ఇద్దరూ ఒక్కరేనని అతనికి తెలియదు. వీళ్లిద్దరి మధ్య గాఢమైన ప్రేమ అయితే ఉంటుంది. చివరికి హోదాను పక్కన పెట్టి బెనెడిక్ట్ తన మనసు గెలిచిన సోఫీని ఎలా పొందాడనేదే మిగిలిన కథ.

Advertisement

Read Also : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Tags

Related News

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×