E-Paper
Advertisement

OTT Movie : ప్రియురాలి ఉచ్చులో ప్రియుడు బలి… మర్డర్ కేసులో అడ్డంగా బుక్… ఓటిటిలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ప్రియురాలి ఉచ్చులో ప్రియుడు బలి… మర్డర్ కేసులో అడ్డంగా బుక్… ఓటిటిలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : అల్లరి నరేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అడుగు పెట్టిన ఇరవై రోజుల్లో డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. అయితే ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అనుకున్నంత రెస్పాన్స్ దక్కలేదు. డిజిటల్ లో కొంత మెరుగ్గా కనిపిస్తోంది. నరేష్ సీరియస్ రోల్‌లో నటించిన ఈ చిత్రం, సాధారణ ప్రేమ కథ నుంచి మర్డర్ మిస్టరీలోకి మారే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగిన నిజ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకివెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘12A రైల్వే కాలనీ’ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నాని కాసరగడ్డ దర్శకత్వంలో రూపొందింది. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల ఇందుల లీడ్ రోల్స్ లో నటించారు. పొలిమేర ఫేమ్ డా. అనిల్ విశ్వనాథ్ స్టోరీ అందించిన ఈ మూవీ, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ నిర్మాణంలో రూపొందింది. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్‌లో మరో థ్రిల్లర్ అటెంప్ట్‌గా నిలిచింది. థియేటర్స్‌లో 2025 నవంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా డిసెంబర్ 11నుంచి Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 2 గంటల నిడివితో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం డబ్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : మనుషుల శరీరాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి… 2025లో ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూవ్డ్ 8 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్

స్టోరీ ఏమిటంటే

కార్తీక్ (అల్లరి నరేష్) ఒక అనే యువకుడు, తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. అతను తన పొరుగున ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)తో ప్రేమలో ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆరాధన హఠాత్తుగా మర్డర్ అవ్వడంతో ట్విస్ట్ తీసుకుంటుంది.
ఈ హత్యలన్నీ ’12A’ క్వార్టర్స్‌తో సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఒకానొక సందర్భంలో, జరగని నేరానికి కార్తీక్ ప్రధాన నిందితుడిగా మారుతాడు. పోలీసులు మరియు స్థానికులు అతన్నే దోషిగా నమ్ముతారు.

Advertisement

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కార్తీక్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆ 12A ఇంట్లో గతంలో చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ తిరుగుతోందని, అదే ఈ హత్యలకు కారణమని స్థానికులు భయపడుతుంటారు. అయితే అది నిజంగా ఆత్మ పనా? లేక ఎవరైనా మనుషులు కావాలని చేస్తున్న కుట్రా? అనే కోణంలో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమా చివరిలో ‘పొలిమేర’ తరహాలోనే ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది. ఈ హత్యల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ఆ 12A ఇంటికి ఉన్న శాపం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×