E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు
Advertisement

Vaibhav Suryavanshi: టీమిండియా కుర్ర క్రికెటర్, 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి ( Vaibhav Suryavanshi ) ఘోర అవమానం ఎదురయింది. అతని ఏజ్ పై పాకిస్తాన్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేసిన వీడియో బయటకు వచ్చింది. గత మూడు సంవత్సరాలుగా తన వయసు 14 ఏళ్లు అంటూ చెప్పుకుని తిరుగుతున్నాడని వైభవ్ సూర్య వంశీ ముఖం మీదే కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయారు పాకిస్తాన్ ఫ్యాన్స్. ఈ సంఘటన అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా మొన్న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇండియన్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుర్రాడిని పట్టుకొని ఇలా పాకిస్తాన్ వెధ‌వలు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

వైభవ్ సూర్యవంశీ చీటర్ అంటూ ట్రోలింగ్

Advertisement

ఆసియా కప్ అండర్ 19 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఆదివారం అంటే డిసెంబర్ 14వ తేదీన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండి అద్భుతంగా రాణించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 50 ఓవర్ల ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, 46.1 ఓవర్లలో 240 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అండర్ 19 పాకిస్తాన్ 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. దీంతో 90 పరుగులు తేడాతో అండర్ 19 పాకిస్తాన్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా బౌండరీ గేటు వద్ద 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఫీల్డింగ్ చేశాడు. అతడు ఫీల్డింగ్ చేస్తున్న నేపథ్యంలో బౌండరీ గేట్ దగ్గర కూర్చున్న పాకిస్తాన్ అభిమానులు రెచ్చిపోయారు. సూర్య భాయ్ .. నీ వయసు ఇంకా 14 ఏళ్ళేనా ? మూడేళ్లుగా అదే చెప్పుకొని తిరుగుతున్నావ్ ? నువ్వు పెద్ద మోసగాడివి అంటూ రెచ్చిపోయారు. నువ్వు చిన్న పిల్లవాడి లాగా లేవు.. 30 ఏళ్లు వచ్చిన వాడిలాగా కనిపిస్తున్నామని సెటైర్లు పేల్చారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన వైభవ్ సూర్యవంశీ, అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన వైభవ్ సూర్యవంశీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏజ్ విషయంలో అబద్ధం ఆడాల్సిన అవసరం వైభవ్ సూర్య‌ వంశీకి (Vaibhav Suryavanshi Age) లేదని కౌంటర్ ఇస్తున్నారు.

వైభ‌వ్ సూర్య వంశీ ఏజ్ విష‌యంలో చీట్ చేశాడా ?

Advertisement

టీమిండియా ( Team India) కుర్ర క్రికెటర్, 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి ( Vaibhav Suryavanshi ) చీటింగ్ చేయ‌లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే ప‌లుసార్లు వెల్ల‌డించింది. మ‌నిషి చూడ‌టానికి ఏజ్ పై బ‌డిన వాడిలాగా క‌నిపిస్తాడు కానీ,
వైభవ్ సూర్య వంశీకి 14 ఏళ్లు అని క్లారిటీ ఇచ్చిందట బీసీసీఐ.

 

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×