OTT Movie : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధికా ఆప్టే నటించిన ‘సాలీ మొహబ్బత్’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సదరు సంస్థ అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చింది. ఇది IFFI, చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అందుకు తగ్గట్టు రాధికా పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు చెబుతున్నారు. రాధికా ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. డబుల్ మర్డర్స్ చుట్టూ తిరిగే ఈ కథ ఊహించని ట్విస్ట్లు, ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకుంటుంది. ఇది ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
టిస్కా చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘సాలీ మొహబ్బత్’ 2025 డిసెంబర్ 12న ZEE5లో రిలీజ్ అవ్వబోతోంది. రాధికా ఆప్టే టైటిల్ క్యారెక్టర్ స్మితగా నటించిన ఈ సినిమాలో దివ్యేందు శర్మ, అనురాగ్ కశ్యప్, అన్షుమాన్ పుష్కర్, శరత్ సక్సేనా, సౌరసేని మైత్రా, కుషా కపిలా మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. 110 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.2/10 రేటింగ్ ని కూడా పొందింది.
స్మితా అనే 35 ఏళ్ల హౌస్‌వైఫ్, రోజూ ఇంటి పని, భర్త అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చాక భోజనం పెట్టి, టీవీ చూసి పడుకోవడం… ఇదే రొటీన్. బయట చూస్తే పర్ఫెక్ట్ కపుల్, కానీ లోపల మాత్రం తేడాగానే ఉంటుంది. అర్జున్ లేట్‌గా వస్తాడు, ఫోన్ ఎప్పుడూ సైలెంట్‌లో పెట్టుకుంటాడు, రాత్రి బాల్కనీలో ఒంటరిగా ఫోన్ మాట్లాడతాడు. స్మితా మొదట్లో ఏమీ అనుకోలేదు, కానీ ఒక రోజు అతని షర్ట్ పాకెట్‌లో ఒక లిప్‌స్టిక్ మార్క్, ఇంకో రోజు ఫోన్‌లో మిస్ యూ జాన్అనే మెసేజ్… అంతే, స్మితా మైండ్‌లో ఫైర్ మొదలవుతుంది. అర్జున్ కజిన్ రేణు అదే ఊరిలో ఉంటుంది, ఫ్రీక్వెంట్‌గా ఇంటికి కూడా వస్తుంది.
Read Also : దొంగతనానికి వచ్చి ప్రేమలో… మతిపోగొట్టే సీన్లు… ఓటీటీలోకి క్రిస్మస్ స్పెషల్
రేణు వచ్చినప్పుడల్లా అర్జున్ కళ్లలో చాలా సంతోషంగా ఉంటాడు. స్మితా దీన్ని గమనిస్తుంది. ఒక రోజు స్మితా ఇంట్లో లేనప్పుడు రేణు బెడ్‌రూమ్‌లో ఉందని తెలిసింది. అంతే… స్మితా మనసులో గుండె పగిలిపోయింది. ఇప్పుడు స్మితా డార్క్ మోడ్ ఆన్ చేస్తుంది. మొదట ఏమీ మాట్లాడలేదు. రోజూ నవ్వుతూ, ఇంట్లో పని చేస్తూ, రాత్రి అర్జున్‌తో రొమాన్స్ కూడా చేస్తూ… కానీ మనసులో ప్లాన్ రెడీ చేసుకుంది. ఈ ప్లాన్ ఏమిటి ? ఎలా అమలు చేస్తుంది ? పోలీసులు ఆమెను పట్టుకుంటారా ? ఈ కథ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.