E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/11/2025) ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/11/2025) ఆ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు.

వృషభం

Advertisement

 చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. 

మిథునం

 వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం

Advertisement

రుణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా  సాగుతాయి.  బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది.

సింహం

 వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత  ఆలోచనలు కలసిరావు. నూతన రుణ ప్రయత్నాలు  చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

కన్య

అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

వృశ్చికం

  నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సహోద్యోగులతో  మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ  ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ధనుస్సు

ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విందువినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి  ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

మకరం

వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు.  సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

కుంభం

అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో నీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా  సాగుతాయి.  ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మీనం

ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×