E-Paper
Advertisement

Most Searched Netflix Movie : 2025లో గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ మూవీ… రెండున్నర గంటల నిడివి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Most Searched Netflix Movie : 2025లో గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ మూవీ… రెండున్నర గంటల నిడివి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ
Advertisement

Most Searched Netflix Movie : ప్రతి సంవత్సరం అత్యధికంగా సర్చ్ చేసిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం, భారతదేశంలో నెటిజెన్స్ అత్యధికంగా సర్చ్ చేసిన సినిమా ఏదో తెలిసిపోయింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా పేరును గూగుల్ బయట పెట్టింది. 2025 లో గూగుల్ లో ఒక బాలీవుడ్ మూవీ అత్యధికంగా సర్చ్ చేసిన జాబితాలో ఉంది. థియేటర్లలోకి వచ్చేంత వరకు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు కూడా లేవు. ఆ తరువాత ఈ చిత్రం ఇంత పెద్ద ఊహించని హిట్ అందుకుంది. ఈ చిత్రంలోని పాటలను ఆడియన్స్ బాగా ఆదరించారు. వసూళ్ల పరంగా, ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఇద్దరు కొత్త నటులు నటించారు. కొత్త నటులతోనే ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ సినిమా పేరు ఏమిటంటే

మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు ‘సైయారా’. 2025లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమా ఇదే. ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా ఇది నిలిచింది. ఇది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ వసూళ్లు సాధించింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ₹337 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 579 కోట్లు వసూలు చేసింది. ఇది చావా తర్వాత రెండవ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : మొగుడి మర్డర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… డిటెక్టివ్ తో దోబూచులాటలు

అదిరిపోయిన నిర్మాతల పబ్లిసిటీ స్టంట్

ఈ సినిమా విడుదలైనప్పుడు ఇంత సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. సైయారా చూసిన తర్వాత ప్రజలు ఏడుస్తున్నట్లు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది నిర్మాతల ప్రచార స్టంట్ అని తెలిసింది. ఏదేమైనా ఈ మూవీ సంచలనాలు సృష్టించి, దాని బడ్జెట్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇప్పుడు గూగుల్ మోస్ట్ సెర్చెడ్ మూవీగా గుర్తింపు పొందింది. ఇక ఈ కథలో ప్రేమలో విఫలమైన వాణి బత్రా(అనీత్ పడ్డా), మ్యూజిక్ సెన్సేషన్ అవ్వాలని పరితపించే క్రిష్ కపూర్(అహాన్ పాండే) అనుకోకుండా ఒక సారి కలుస్తారు. వాణి లిరిక్స్ తో ట్యున్స్ కంపోజ్ చేస్తాడు క్రిష్. ఇలా వాళ్ళ లవ్ మొదలవుతుంది. అయితే ఆమె గతం మరచిపోవడంతో స్టోరీ మలుపులు తిరుగుతుంది. చివరికి వాళ్ళిద్దరూ కలిశారా ? లేదా ? అనేదే ఈ స్టోరీ.

Advertisement

 

 

 

 

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×