E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 95 : భరణి గాలి తీసేసిన తనూజ… ఆడియన్స్ చేతిలో అడ్డంగా బుక్… అంతమాట అనేసిందేంటి భయ్యా

Bigg Boss 9 Telugu Day 95 : భరణి గాలి తీసేసిన తనూజ… ఆడియన్స్ చేతిలో అడ్డంగా బుక్… అంతమాట అనేసిందేంటి భయ్యా
Advertisement

Bigg Boss 9 Telugu Day 95 : బిగ్ బాస్ సీజన్ 9లో జరుగుతున్న ఇమ్యూనిటీ పోరు నుంచి తాజా ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని తొలగించారు బిగ్ బాస్. “లీస్ట్ లో ఉన్న కారణంగా ఈ పోరులో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మీరు సాధించిన లక్ష పాయింట్స్ లో సగం, ఈ పోరులో గెలిచిన సగం పాయింట్స్ ను ఎవరో ఒకరికి ఇవ్వండి” అని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో ఎమోషనల్ అయిన సుమన్ “నాకు ఈ హౌస్ లో మీరు తప్ప ఎవరున్నారు?” అంటూ భరణికి ఆ పాయింట్స్ ను ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. కానీ భరణి “ఆ పాయింట్స్ నాకంటే సంజనాకు ఎక్కువ ఉపయోగపడతాయి” అని సలహా ఇచ్చాడు. దీంతో సుమన్ తన నిర్ణయాన్ని మార్చుకుని సంజనాకు పాయింట్స్ ఇచ్చాడు. “నోరు తెరిచి అడగలేను అన్నా” అంటూ సంజనా కన్నీళ్లు పెట్టుకుంది.

ఇది జోక్ కాదు డ్యూడ్ 

ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ లో పాల్గొనకుండా ఉండేందుకు ఒకరిని సెలెక్ట్ చేయాల్సిన టైమ్ వచ్చింది. అందరూ కలిసి లీడర్ బోర్డులో టాప్ లో ఉన్న భరణిని పక్కన పెట్టేశారు. “లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న టాస్క్ ఇది జోక్ కాదు. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా తమకు కేటాయించిన 6 బాల్స్ ను సీసాపై నుంచి స్క్రోల్ చేసి, జోకర్ ఫేస్ తగిలేలా కొట్టాలి” అని కొత్త టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో సంజన గెలిచింది. ఈ టాస్క్ తరువాత సంజన 290, ఇమ్మూ 270, భరణి 230, తనూజా 220, డెమోన్ 150 పాయింట్స్ తో లీడర్ బోర్డులో ఉన్నారు. దీంతో లీస్ట్ లో ఉన్న డెమోన్ ను ఈ టాస్క్ నుంచి తొలగించారు బిగ్ బాస్. అలాగే తను సాధించిన 1,50,000 లక్షలు, పాయింట్స్ ను హౌస్ మేట్స్ లో ఒకరికి ఇవ్వాలన్నారు. డెమోన్ తనుజాకు ఇచ్చేశాడు.

భరణి బాధ… ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ 

Advertisement

“ఇంటి సభ్యుల్లో మరొకరిని గేమ్ నుంచి తొలగించాల్సిన సమయం వచ్చింది. అలాగే చెప్పడం మర్చిపోయా. ఓటు అప్పీల్ కు ఇదే చివరి ఛాన్స్” అంటూ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అందరూ తననే టార్గెట్ చేస్తారని ముందుగానే ఊహించిన భరణి హౌస్ మేట్స్ ను మళ్ళీ తన పేరే చెప్పొద్దని కోరాడు. తనూజ దగ్గరకు వెళ్ళి “లాస్ట్ టైమ్ హయ్యెస్ట్ అని నా పేరే చెప్పారు. ఈసారి తీయొద్దు” అని అడిగాడు భరణి. “ఇమ్మూని మాత్రం తీయాలి అనుకోవట్లేదు” అని చెప్పింది తనూజా. “నాకంటే ఎందుకు ఇమ్మూ బెటర్” అని అడిగాడు భరణి. “ఈ మధ్య కాలంలో నాకు స్టాండ్ తీసుకుంది వాడే కదా” అని మొహం మీదే చెప్పేసింది తనుజా. దీంతో భరణి తెగ ఫీల్ అయ్యాడు. చివరికి భరణిని ఈ టాస్క్ నుంచి తొలగించారు.

చివరగా “బ్యాలెన్స్ అండ్ స్టడీ” అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో లెటర్లతో ఉన్న బ్లాక్స్ ను ఒక్కొకటిగా తికుని, స్టాండ్ దగ్గరకు వచ్చి, కాలి సహాయంతో దాన్ని లాక్ చేసి, బ్యాలెన్స్ ఉండేందుకు చేతి సహాయంతో బ్లాక్ అమర్చాలి. మరో బ్లాక్ తీసుకు రావడానికి వెళ్తూ మళ్ళీ లాక్ చేయాలి. ముందుగా అన్నీ సెట్ చేసిన వారే విన్నర్” అంటూ టాస్క్ షురూ చేశారు బిగ్ బాస్. ఇమ్మూ విన్ అవ్వడంతో… ఈ టాస్క్ లో సెకండ్ వచ్చిన తనూజా 335, ఇమ్మూ 320, సంజన 320, భరణి 230 పాయింట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇమ్మూ, సంజన మధ్య పాయింట్స్ టై కాగా, టాపర్ తనూజ ప్రేక్షకులను ఎదుర్కొనే ఛాన్స్ ను ఆ ఇద్దరిలో సంజనకు ఇచ్చింది. చివరగా ఆడియన్స్ నిర్ణయం మేరకు తనూజ ఓటు అప్పీల్ చేసుకుంది.

Advertisement

Read Also : మీరు అందరిని వాడుకున్నారు, తనుజకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చిన ఆడియన్

 

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×