OTT Movie : కొన్ని సినిమాలు అంచనాలతో బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతుంటాయి. అయితే ఘోరంగా పరాజయం పొందుతుంటాయి. అయితే విచిత్రంగా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఇవే సినిమాలు పాపులర్ అవుతుంటాయి. అలా పాపులర్ అయిన సినిమానే “సజినీ షిండే కా వైరల్ వీడియో”. ఇందులో ఒక స్కూల్ టీచర్ ప్రైవేట్ వీడియో వైరల్ తర్వాత మిస్సింగ్ అవుతుంది. దీంతో కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఆమె ఏమైంది అనే సస్పెన్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా 15 కోట్ల బడ్జెట్ తో కేవలం 3.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి థియేటర్లలో భారీ పరాజయాన్ని చవి చూసింది.
‘సజిని షిండే కా వైరల్ వీడియో’ (Sajini Shinde Ka Viral Video) 2023లో విడుదలైన ఒక హిందీ మిస్టరీ మూవీ. దీనికి మిఖిల్ ముసలే దర్శకత్వం వహించారు. ఇందులో నిమ్రత్ కౌర్, రాధిక మదన్, భాగ్యశ్రీ, సుబోధ్ భావే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2023 అక్టోబర్ 27న విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది.
పుణేలోని ఒక ప్రెస్టీజియస్ స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్ సజినీ షిండే ఒక బ్యాచిలరెట్ పార్టీకి వెళ్తుంది. అక్కడ ఒక అభ్యంతరకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో స్కూల్ మేనేజ్‌మెంట్, పేరెంట్స్, స్టూడెంట్స్ ఆమెను ఇగ్నోర్ చేస్తారు. సజినీ డిప్రెషన్‌లోకి జారుకుని ఒక రోజు అదృశ్యమవుతుంది. ఆమె ఫియాన్సే సిద్ధాంత్ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇస్తాడు, ఇన్స్పెక్టర్ బెలా బరోట్ ఈ కేసు టేకప్ చేసి సజినీ ఫోన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. వీడియో ఎవరు లీక్ చేశారు, సజినీ ఎక్కడికి వెళ్లింది అనే మిస్టరీ స్టార్టవుతుంది.
Read Also : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ
బెలా ఇన్వెస్టిగేషన్‌లో సజినీ స్టూడెంట్ కల్పనా, స్కూల్ ప్రిన్సిపల్, సిద్ధాంత్, సజినీ సోదరి సుమిత్ వంటి సస్పెక్ట్స్‌ను ఇంటరాగేట్ చేస్తుంది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ, సాజిని జీవితం గురించి, ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, మరియు ఆమె అదృశ్యం వెనుక ఉన్న రహస్యాల గురించి అనేక నిజాలు బయటపడతాయి. చివరికి సాజిని నిజంగానే చనిపోయిందా, లేక అదంతా ఒక నాటకమా ? అనే సస్పెన్స్‌తో సినిమా సాగుతుంది. ఈ విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.