BigTV English
Advertisement

OTT Movie : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ

OTT Movie : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ

OTT Movie : జీ5 ఒరిజినల్ సిరీస్ ‘థోడే దూర్ థోడే పాస్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ ఒక ఆధునిక కుటుంబం డిజిటల్ ప్రపంచంలో లీనమై, రియల్ కనెక్షన్స్ కోల్పోయిన సమస్యను చక్కగా చూపిస్తుంది. ఈ రోజుల్లో మనుషులు తమకు తెలీకుండానే, ఈ టెక్నాలజీ మత్తులోకి వెళ్తున్న విధానాన్ని ఇది కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండి కూడా దూరమైపోతున్నారు. ఈ సమస్య చాప కింద నీరులా మనిషిని నిండా ముంచేస్తోంది. అయితే దీని నుంచి బయట పడే సన్నివేశాలు కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇదొక పర్ఫెక్ట్ బింజ్ వాచ్ సిరీస్. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘థోడే దూర్ థోడే పాస్’ (Thode Door Thode Paas) 2025అనే ఈ సిరీస్‌ను అజయ్ భూయాన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో పంకజ్ కపూర్ (రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అశ్విన్ మెహతా), మోనా సింగ్ (సిమ్రాన్ మెహతా), కునాల్ రాయ్ కపూర్ (కునాల్ మెహతా), అయేషా కదుస్కర్ (అవ్ని), సర్తాజ్ కక్కర్ (వివాన్) లీడ్ రోల్స్‌లో నటించారు. మనీష్ త్రెహాన్, షైలేష్ సంఘ్వీ నిర్మాణంలో రూపొందిన ఈ 5 ఎపిసోడ్ల సిరీస్ 2025 నవంబర్ 7నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ రిలీజ్ అయిన వెంటనే అంతటా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఐయండిబిలో ఏకంగా దీనికి 8.6/10 రేటింగ్ ఉంది.

Read Also : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి


స్టోరీ ఏమిటంటే

మెహత ఫ్యామిలీలో అందరూ ఒకే ఇంట్లో ఉండి కూడా మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌లో మునిగిపోతుంటారు. దీని వల్ల ఒకరికి ఒకరు కనీసం పలకరించుకోవడం కూడా మానేస్తారు. ఈ ఫ్యామిలిలో సిమ్రాన్ బ్రైడల్ బుటిక్ నడుపుతుంది. కునాల్ ఆన్‌లైన్ న్యూమరాలజిస్ట్. కూతురు అవ్ని సోషల్ మీడియా అడిక్ట్, కొడుకు వివాన్ గేమ్స్‌లో మునిగిపోతాడు. రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అశ్విన్ మెహత్ ఇంటికి వచ్చి ఈ గందరగోళం చూసి షాకవుతాడు. ఇక అతను భార్య ఫోటోతో ఒంటరిగా భోజనం చేసే సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఇవన్నీ చూసి అశ్విన్ ఒక ఛాలెంజ్ విసురుతాడు. 6 నెలలు ఫోన్స్, ల్యాప్‌టాప్స్, సోషల్ మీడియా లేకుండా ఉంటే ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఇస్తానని చెప్పడంతో అందరూ అవాక్కవుతారు. మొదట డబ్బు కోసం అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆచరించేటప్పుడు అంత సులువుగా సాగదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. చివరికి వీళ్ళు డిజిటల్ లేకుండా ఉండగలుగుతారా ? ఈ పందెంలో గెలుస్తారా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

OTT Movie : యూకేలోని అతిపెద్ద కుంభకోణం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

Big Stories

×