E-Paper
Advertisement

అతను అడుగు పెడితే అనుమానాస్పద మరణాలు… వింటేజ్ వ్యాంపైర్ థ్రిల్లర్

అతను అడుగు పెడితే అనుమానాస్పద మరణాలు… వింటేజ్ వ్యాంపైర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller : కొన్ని ఊళ్లు బయటకు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. పాత ఇళ్లు, ఖాళీ వీధులు, నెమ్మదిగా సాగే జీవితం ఉంటుంది. అయితే అలాంటి ఊర్ల వెనుక కొన్ని చీకటి రహస్యలు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఊర్లోకి అడుగుపెట్టిన తర్వాత వరుసగా మనుషులు కనిపించకుండా పోతుంటారు.. మరణాలు కూడా పెరుగుతుంటాయి.. సరిగ్గా ఈ తరహా కథనే భయానకంగా, ఉత్కంఠభరితంగా చెప్పిన మూవీ సేలమ్స్ లాట్ (Salems lot). స్టీఫెన్ కింగ్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన ఈ 2024 హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు.

ఈ సినిమా కథేంటి?

కథలో బెన్ మియర్స్ అనే రచయిత చాలా సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి ఊరు జెరూసలెమ్స్ లాట్‌కు తిరిగి వస్తాడు. తన కొత్త నవల కోసం ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో వచ్చిన అతనికి అక్కడి వాతావరణంలో ఏదో విచిత్రం కనిపిస్తుంది. ఊరంతా ఒక తెలియని భయంతో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. మొదట చిన్న చిన్న ఘటనలుగా కనిపించిన విషయాలు క్రమంగా పెద్ద రహస్యంగా మారిపోతాయి. ఊర్లోకి ఒక కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత అనుమానాస్పదంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం, కొందరు రాత్రికి రాత్రే అదృశ్యం కావడం, విచిత్రమైన మరణాలు చోటుచేసుకోవడం మొదలవుతుంది. చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

బెన్ ఈ ఘటనల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతనికి ఊహించని భయంకరమైన వాస్తవాలు తెలుస్తాయి. ఊర్లో జరుగుతున్నవి సాధారణ నేరాలు కాదని, వాటి వెనుక మానవ శక్తులకు అతీతమైన చీకటి దాగి ఉందని గ్రహిస్తాడు. అక్కడి నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ సినిమా ప్రధాన బలం దాని వాతావరణం. ఇటు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ప్రేక్షకులను కథలో ముంచేస్తుంది. ముఖ్యంగా పాత తరహా వ్యాంపైర్ కథలను ఆధునిక టెక్నాలజీతో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

హారర్ అభిమానులకు ఈ చిత్రం ఎందుకు ప్రత్యేకమంటే ఇందులో కేవలం రక్తపాతం మాత్రమే కాకుండా మిస్టరీ, సస్పెన్స్, భయం కూడా బ్యాలెన్స్‌ అవుతాయి. కథ ముందుకు సాగే కొద్దీ ఊర్లోని ప్రతి వ్యక్తిపైనా అనుమానం రావడం, ఎవరు సురక్షితంగా ఉన్నారో అర్థం కాకపోవడం ఉత్కంఠను మరింత పెంచుతుంది. వ్యాంపైర్ కథలు, చీకటి వాతావరణం, పాతకాలపు హారర్ ఫీల్ ఇష్టపడేవారికి సేలమ్స్ లాట్ ఒక మంచి ఎంపిక. చీకటి పడిన తర్వాత ఆ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

Advertisement

Read Also : ఇష్టంలేని పెళ్లి… కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్… పెళ్ళయిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Related News

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

30 సెకన్ల ఇంధనంతో చంద్రుడిపై ల్యాండింగ్‌… ప్రాణాలకు తెగించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ప్రయాణం… మస్ట్ వాచ్ మూవీ

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

Big Stories

Advertisement
×