E-Paper
Advertisement

బేస్మెంట్‌లో పిశాచి… అమ్మాయిలను బంధించి ఇవేం పాడు పనులు

బేస్మెంట్‌లో పిశాచి… అమ్మాయిలను బంధించి ఇవేం పాడు పనులు
Advertisement

Psychological Horror Thriller : కొత్త నగరానికి వెళ్లినప్పుడు హోటల్ బుక్ చేసుకోవడం, అద్దె ఇల్లు తీసుకోవడం చాలా సాధారణ విషయం. కానీ మీరు బుక్ చేసిన ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ ఇప్పటికే ఇంకొక వ్యక్తి ఉంటే? బయట వర్షం, రాత్రి చీకటి, వెళ్లడానికి మరో చోటు లేకపోతే? అదే పరిస్థితిలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం జీవితంలోనే అతిపెద్ద పీడకలగా మారితే? ఈ ఆసక్తికరమైన ఆలోచనతో రూపొందిన సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ బార్బేరియన్. 2022లో విడుదలైన ఈ చిత్రానికి జాక్ క్రెగర్ దర్శకత్వం వహించారు. విడుదల సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, కథలోని ఊహించని మలుపులు, కలవరపెట్టే హారర్ అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

వింత శబ్దాలు.. రహస్య మార్గాలు:

కథలో టెస్ అనే యువతి ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఒక కొత్త నగరానికి వస్తుంది. ముందుగానే బుక్ చేసుకున్న అద్దె ఇంటికి చేరుకున్న తర్వాత ఆమెకు ఒక షాక్ ఎదురవుతుంది. అదే ఇంటిని మరో వ్యక్తి కూడా బుక్ చేసుకుని అక్కడ అప్పటికే కనిపిస్తాడు. అయితే అక్కడి పరిస్థితుల కారణంగా ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. కానీ మరుసటి రోజు నుంచి విచిత్రమైన ఘటనలు ప్రారంభమవుతాయి. ఇంట్లో కనిపించకూడని కొన్ని వస్తువులు కనిపించడం, వింత శబ్దాలు వినిపించడం, ఇంటి నిర్మాణంలో దాగి ఉన్న రహస్య మార్గాలు బయటపడటం కథను పూర్తిగా మార్చేస్తాయి. ముఖ్యంగా ఇంటి బేస్మెంట్‌లో కనిపించే ఒక రహస్య ద్వారం తెరిచిన తర్వాత పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది.

Advertisement

ఆ బేస్మెంట్‌లో దాగి ఉన్న నిజం క్రమంగా బయటపడుతుండగా ప్రేక్షకులు కూడా షాక్‌కు గురవుతారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్న భయంకర ఘటనలు, అదృశ్యమైన యువతుల కథలు, మానవత్వానికే మచ్చ తెచ్చే నేరాలు కథలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. సినిమా ముందుకు సాగే కొద్దీ ఇది సాధారణ హారర్ మూవీ కాదని, మనుషులలో దాగి ఉండే చీకటి కోణాల గురించి చెప్పే కథ అని అర్థమవుతుంది.

బార్బేరియన్ బలం దాని అనూహ్యమైన స్క్రీన్ ప్లే. ప్రేక్షకుడు ఒక దిశలో ఆలోచిస్తున్నప్పుడు కథ పూర్తిగా మరో దిశలోకి వెళ్లిపోతుంది. ప్రతి 20నిమిషాలకు కథ రూపం మారిపోవడం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. హారర్, మిస్టరీ, సైకాలజికల్ థ్రిల్లర్ అంశాలు అద్భుతంగా మిళితమయ్యాయి. కొత్త ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లేవారు, తెలియని ఇళ్లలో ఉండేవారు ఈ సినిమా చూస్తే కొంతసేపు అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దెయ్యాల కంటే మనుషులే ఎంత భయంకరంగా మారగలరో చూపించే సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న బార్బేరియన్, ఇటీవల సంవత్సరాల్లో వచ్చిన అత్యుత్తమ సైకాలజికల్ హారర్ థ్రిల్లర్లలో ఒకటిగా చెప్పొచ్చు. చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించలేని కథలు ఇష్టపడేవారికి ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా.

Advertisement

Read Also : నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి ఇంత క్రేజా… మోస్ట్ ఇన్‌స్టా ట్రెండింగ్ మలయాళం మూవీ

Tags

Related News

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

Big Stories

Advertisement
×