BigTV English

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో (1943–1945) ఇటలీలో ఫాసిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ సాలో నేపథ్యంలో ఒక వివాదాస్పద చిత్రం తెరకెక్కింది. అక్కడి నియంత పాసోలిని పరిపాలన ఎలా ఉండేదో చూపించారు. పాసోలిని హత్య తర్వాత మూడు వారాలకు ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే దాని ఘోరమైన కంటెంట్ కారణంగా అనేక దేశాలలో ఈ సినిమాని బ్యాన్ చేశారు. ఈ సినిమా నలుగురు అవినీతిపరులైన ఇటాలియన్ అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒక మాన్షన్‌లో అమ్మాయిలను, అబ్బాయిలను బంధించి పైశాచిక చర్యలతో వీళ్ళు ఆనందం పొందుతుంటారు. అత్యంత డిస్టర్బింగ్ చిత్రాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఈసినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

ఈ చిత్రం ఇటలీలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరుగుతుంది. 1944లో నాజీ రిపబ్లిక్ ఆఫ్ సాలోలో, నలుగురు శక్తివంతమైన, దుర్మార్గమైన వ్యక్తులు (డ్యూక్, బిషప్, మాజిస్ట్రేట్, ప్రెసిడెంట్) తమ కూటమిని బలోపేతం చేయడానికి ఒకరి కుమార్తెలను మరొకరు వివాహం చేసుకుంటారు. ఆతరువాత వీళ్ళు తొమ్మిది మంది యువకులను, తొమ్మిది మంది యువతులను కిడ్నాప్ చేసి, ఒక విలాసవంతమైన మాన్షన్‌కు తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళు ప్లాన్ ప్రకారం లైం*గిక, మానసిక హింసకు గురిచేస్తారు. వీళ్ళు తమ సాడిస్టిక్ చర్యలను తీవ్రతరం చేస్తారు. బైనాక్యులర్స్ ద్వారా ఈ హింసను చూస్తూ ఆనందిస్తుంటారు. ఈ చిత్రం ఫాసిజం నేపథ్యంలో ఈ చర్యలను అత్యంత దారుణంగా చిత్రీకరించింది.


ఈ చిత్రం కేవలం హింసను చూపించడమే కాకుండా, అధికారం, దుర్వినియోగం, ఫాసిజం, మనిషి సైకిక్ కోణాన్ని చూపిస్తుంది. బందీలైన యువకులు తమ బాధలను ఎదుర్కొంటూ, కొందరు విధేయత చూపిస్తారు. మరికొందరు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ చివరికి అధికారం ముందు నిస్సహాయంగా మిగిలిపోతారు. ఈ చిత్రం చాలా డిస్టర్బింగ్ కంటెంట్‌ను కలిగి ఉంది అందరికీ సరిపోదు. ఒంటరిగా చూడటమే మంచిది. గుండె గట్టిగా ఉన్నవాళ్లు మాత్రమే దీనివైపు చుడండి. లేకపోతె సైలెంట్ గానే ఉండండి. మైండ్ పాడైపోతుంది.

ఎందులో ఉందంటే

‘సాలో, ది 120 డేస్ అఫ్ సోడోమ్’ (Salò, or the 120 Days of Sodom) ఇటాలియన్ దర్శకుడు పియర్ పావ్లో పసోలినీ రూపొందించిన వివాదాస్పద ఆర్ట్-హౌస్ చిత్రం. ఇది మార్క్విస్ డి సాడే రచించిన నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం 1943-45లో ఇటలీలోని పాసోలిని పరిపాలన నేపథ్యంలో జరుగుతుంది. ఈ సినిమా 1975 నవంబర్ 22న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం MUBI ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమా 5.8/10 ని పొందింది.

Read Also : 50 ఏళ్ల ఆంటీతో ఆటగాడి అరాచకం… ఆ పనికి నో చెప్పడంతో ఊహించని షాక్… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Related News

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×