OTT Movie : హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంటాయి. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే థ్రిల్లర్ జానర్ ని చూడటానికి మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఉత్కంఠభరితమైన థ్రిల్ ను ఇస్తుంది. అమ్మాయిలను మోసం చేసే ఒక స్కామర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
కథలోకి వెళ్తే
లిల్లీ అనే ఆడిటర్, తన చెల్లెలు వలేరియాని చూడాటానికి ఒక ద్వీపానికి వస్తుంది. కానీ ఆమె చెల్లెలు నాలుగు నెలల క్రితం కలిసిన మాను అనే ఫ్రెంచ్ వ్యక్తి తో నిశ్చితార్థం చేసుకుని, ఒక లగ్జరీ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లిల్లీకి మాను ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. ఎందుకంటే తన చెల్లికి వారసత్వంగా వచ్చిన విలువైన ఎస్టేట్‌ను అమ్మడానికి అతను వలేరియాపై ఒత్తిడి తెస్తుంటాడు. ఈ సమయంలో లిల్లీ ఒక స్థానిక నైట్‌క్లబ్ మేనేజర్ టామ్ ని కలుస్తుంది. వీళ్ళ మధ్య అట్రాక్షన్ మొదలవుతుంది. అంతేకాకుండా సన్నిహితంగా ఎక్కడపడితే అక్కడ గడుపుతుంటారు. ఆతరువాత తను చాలా బాధ పడుతుంది. ఇలా ఎలా లొంగిపోయానని ఆలోచిస్తుంది.
ఇప్పుడు లిల్లీ తన చెల్లెలు ఒక స్కామ్‌లో చిక్కుకుందని గ్రహిస్తుంది. టామ్ కూడా ఈ కుట్రలో భాగమని తెలుస్తుంది. ఇది ఆమెను అయోమయంలో పడేస్తుంది.
మాను గతం తెలుసుకునేందుకు లిల్లీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అతను డబ్బున్న మహిళలను మోసం చేసే ఒక సీరియల్ స్కామర్ అని తెలుస్తుంది. ఇక లిల్లీ ఆలస్యం చేయకుండా, వలేరియాకి మాను నిజస్వరూపం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ వలేరియా అతని ప్రేమలో మునిగిపోయి, ఆమె హెచ్చరికలను పట్టించుకోదు. టామ్ మొదట మానుతో కలిసి పనిచేసినప్పటికీ, లిల్లీ పట్ల నిజమైన ప్రేమతోనే ఉంటాడు. ఆమెకు సహకరించడానికి నిర్ణయించుకుంటాడు. కథ ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. మాను మాయలో నుంచి లిల్లీ చెల్లి బయటపడుతుందా ? లిల్లీ,టామ్ లవ్ స్టోరీ ఏమవుతుంది ? మాను వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘ఫాల్ ఫర్ మీ’ (Fall for Me) ఒక జర్మన్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం. షెర్రీ హోర్మన్ దర్శకత్వంలో, స్టెఫానీ సైకోల్ట్ రాసిన స్క్రీన్‌ప్లేతో రూపొందింది. ఈ చిత్రం స్వెంజా జంగ్ (లిల్లీ), థియో ట్రెబ్స్ (టామ్), టిజాన్ మరీ (వలేరియా), మరియు విక్టర్ మ్యూటెలెట్ (మాను) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : టీనేజ్ అమ్మాయిలే టార్గెట్… తేడా పనులు చేసే పాడు గ్యాంగ్… ఒంటరిగా చూడాల్సిన మూవీ