Sambhavam Movie :కంటెంట్ ఉన్నవాడి కటౌట్ చాలు అన్నట్టుగా భారీ బడ్జెట్ లేకపోతెనేం మా వద్ద సాలిడ్ కంటెంట్ ఉందంటూ మరోసారి ప్రూవ్ చేస్తుంది మలయాళ చిత్ర సీమ.ఈ క్రమంలో ఆడియన్స్ ని కళ్ళు స్క్రీన్ కి అతుక్కుపోయేలా ఎంగేజింగ్ థ్రిల్లర్స్ ని డెలివర్ చేస్తు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.అలాంటి సినిమానే ‘సంభవం:అధ్యాయం ఒన్ను’.
థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే
గత నెల మార్చి6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్నఈ సినిమా ఇపుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైపోయింది.అవును..థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ మైండ్ బెండింగ్ టైమ్ లూప్ థ్రిల్లర్ ఏప్రిల్15న ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్(JioHotstar)లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.అయితే మలయాళీలకు అత్యంత ఇష్టమైన ‘విషు’పండుగ సందర్భంగా ఇది స్ట్రీమింగ్ అవడం విశేషం.
also read:సింగర్ వర్సెస్ లాయర్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంగ్లీ.. అసలు ఏం జరుగుతోంది?
ఈ ఏప్రిల్15నే డిజిటల్ లోకి ఎంట్రీ
అయితే ఇది కేవలం మలయాళ భాషకే పరిమితం కాకుండా తెలుగు,తమిళం,కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తుండటం విశేషం.సో ‘సంభవం:అధ్యాయం ఒన్ను’ప్యాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేసిందన్న మాట.ఏది ఏమైనా మార్చి6న థియేటర్లలో మిస్ అయిన మైండ్ బెండింగ్ టైమ్ లూప్ థ్రిల్లర్ ఈ ఏప్రిల్15నే డిజిటల్ లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే మూవీ లవర్స్ కి అందునా థ్రిల్లర్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఆ అడవిలో ఉన్న మిస్టరీ ఏమిటి?
సినిమా కథ విషయానికి వస్తే ‘సంభవం:అధ్యాయం ఒన్ను’సినిమా ఒక ఇంట్రెస్టింగ్ లూప్ లో జరుగుతుంది.కేరళ మరియు తమిళనాడు సరిహద్దులోని ఒక దట్టమైన అడవిలో వరుసగా మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అవుతుంటాయ్.సడన్ గా కనిపించకుండా పోయిన తమ కొలీగ్ ని వెతుక్కుంటూ వెళ్ళిన పోలీసులకి ఆ అడవిలోకి వెళ్లిన తర్వాత వింత వింత అనుభవాలు ఎదురవుతాయి.అదే క్రమంలో ఒకే సంఘటన చుట్టూ తిరిగే టైమ్ లూప్ లో వాళ్ళు ఇరుక్కుపోతారు.ఒక దశలో తమను తామే వేర్వేరు వెర్షన్లలో చూసుకొని పోలీసులు షాక్ అయిపోతారు.అసలు ఆ అడవిలో ఉన్న మిస్టరీ ఏమిటి?అక్కడికి వెళ్లిన వారు ఎందుకు ఆ లూప్‌లో చిక్కుకుపోతారు?వారు తిరిగి ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేదే ‘సంభవం:అధ్యాయం ఒన్ను’కథ.
సినిమాలోని సస్పెన్స్ పెంచడంలో సక్సెస్
ఈ సినిమాకి కిరణ్ సూర్య దర్శకత్వం వహించగా సంతోష్ కీజత్తూర్,వినీత్ తట్టిల్,గోపాలకృష్ణన్ మరియు జ్యోతిక లు ఇందులో కీలక పాత్రలు పోషించారు.ముఖ్యంగా బడ్జెట్ తక్కువైనా ఎక్కడా తెలీకుండా తమదైన నటనతో సినిమాలోని సస్పెన్స్ పెంచడంలో సక్సెస్ అయ్యారు.ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసిన జోమోన్ థామస్ ని మెచ్చుకొని తీరాల్సిందే.ఇక టెక్నికల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మ్యూజిక్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్తాయ్.మీరు గనుక ఒక మంచి మైండ్ బెండింగ్ టైమ్ లూప్ థ్రిల్లర్ ని అస్సల్ మిస్ అవ్వొద్దు అనుకుంటే మాత్రం ఏప్రిల్15ని మార్క్ చేసి పెట్టేసుకోండి!