E-Paper
Advertisement

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు
Advertisement

Adventure Comedy: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, అడ్వెంచర్ తో సాగే సినిమాలు ఇష్టపడే వాళ్లకు పర్ఫెక్ట్ ఛాయిస్ ‘ది లాస్ట్ సిటీ’ (The Lost City).ఈ చిత్రం ఆసాంతం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. రొమాంటిక్ అడ్వెంచర్ నవలలు రాసే ఒక సక్సెస్‌ఫుల్ లేడీ రైటర్ జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని నాటకీయ పరిణామాల చుట్టూ ఈ కథ చాలా ఫన్నీగా తిరుగుతుంది. మరి ఈ కిరాక్ కామెడీ అడ్వెంచర్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే…

కథలోకి వెళ్తే…

పుస్తకాల్లో సాహసాలు, నిధుల వేట గురించి రాసే రచయిత్రి నిజంగానే అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సినిమా మొదలవుతుంది. లోరెట్టా సేజ్ ఒక ప్రముఖ రచయిత్రి. పురాతన నగరాలు, రహస్య సమాధులు, విలువైన నిధుల చుట్టూ తిరిగే రొమాంటిక్ అడ్వెంచర్ నవలలు రాస్తుంటుంది. ఆమె పుస్తకాల్లో డాష్ అనే అందమైన సాహసవంతుడైన హీరో పాత్రకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ పాత్రకు పుస్తకాల కవర్‌పై మోడల్‌గా కనిపించేది అలన్. అలన్‌కు తనను తాను నిజ జీవిత హీరోగా నిరూపించుకోవాలనే కోరిక ఉన్నా, నిజంగా ప్రమాదాలు ఎదురైనప్పుడు అతడి ప్రవర్తన మాత్రం నవ్వులు తెప్పిస్తుంది.

Advertisement

తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేసేందుకు లోరెట్టా అలన్‌తో కలిసి ప్రమోషన్స్ కు వెళ్తుంది. అక్కడే కథ అనుకోని మలుపు తిరుగుతుంది. అబిగైల్ ఫెయిర్‌ఫాక్స్ అనే ధనవంతుడు ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు. లోరెట్టా రాసిన తాజా నవలలోని పురాతన నగరం నిజంగానే ఉందని, దానికి సంబంధించిన రహస్య మార్గం ఆమెకు తెలుసని అతడు నమ్ముతాడు. ఆ నగరంలో ఉన్న విలువైన నిధిని ఎలాగైనా సంపాదించాలని ఆమెను బలవంతంగా దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్తాడు. అయితే లోరెట్టా రాసిన కథ కల్పితమా, నిజ జీవితంలో దానికి సంబంధించిన ఆధారాలున్నాయా అనే విషయం అతడు ఆలోచించడు.

మరోవైపు, లోరెట్టా ప్రమాదంలో పడిందని తెలుసుకున్న అలన్ ఆమెను కాపాడటానికి బయలుదేరుతాడు. పుస్తకాల్లో హీరోగా కనిపించే డాష్ పాత్రను తానే నిజ జీవితంలోనూ పోషించగలనని నిరూపించుకోవాలని అనుకుంటాడు. కానీ అతడికి ఎదురయ్యే సవాళ్లు మాత్రం పుస్తకాల్లో ఉన్నంత సులభంగా ఉండవు. దట్టమైన అడవి, ప్రమాదకరమైన పరిస్థితులు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ప్రయాణం… వీటన్నింటి మధ్య అలన్ చేసే ప్రయత్నాలు కామెడీకి దారి తీస్తాయి. లోరెట్టా కూడా తక్కువేం కాదు. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి నుంచి బయట పడటానికి, అలన్‌తో కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఈ ప్రయాణంలో వాళ్ళు ప్రాణాలతో బయట పడ్డారా లేదా ? అన్నది సినిమాలో చూడాల్సిందే.

స్ట్రీమింగ్ డీటైల్స్

Advertisement

హాలీవుడ్ స్టార్స్ శాండ్రా బుల్లక్, చానింగ్ టెటమ్ లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘ది లాస్ట్ సిటీ’. జియో హాట్‌స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో చూడవచ్చు. తెలుగు ఆడియో మాత్రం లేదు. ఆడమ్ నీ, ఆరోన్ నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడ్వెంచర్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. ఆఫీస్ టెన్షన్ మర్చిపోయి ఫ్యామిలీతో కలిసి నవ్వుకోవాలనుకునే వారికి ఈ అడ్వెంచర్ కామెడీ మంచి ఆప్షన్.

Read Also: ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

Related News

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

30 సెకన్ల ఇంధనంతో చంద్రుడిపై ల్యాండింగ్‌… ప్రాణాలకు తెగించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ప్రయాణం… మస్ట్ వాచ్ మూవీ

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

Big Stories

Advertisement
×