E-Paper
Advertisement

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్
Advertisement

Romantic Comedy Movie: లవ్‌ లో ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరం ప్రాణాలైనా ఇస్తామని అంటారు. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యాక, అదే లవర్ వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకుంటున్నాడు అంటే ఎవరికైనా మంట పుడుతుంది కదా. అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ తో రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న మూవీనే ‘లవ్ లాంగ్వేజ్’ (Love Language). పాత లవర్ పెళ్లికి వెళ్లి మైండ్ బ్లోయింగ్ పని చేసిన ఒక అమ్మాయి చుట్టూ తిరిగే ఈ స్టోరీ లవర్స్ అందరిని కచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను ఎక్కడ చూడవచ్చు ? అనే విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

లూయిసా ‘లూ’ క్లాస్‌నర్ (Chloë Grace Moretz) లైఫ్‌ లో రీసెంట్‌ గా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుంది. దాంతో ఆమె లవ్ మీద నమ్మకం కోల్పోయి తన కెరీర్‌ పై ఫోకస్ పెడుతుంది. కొత్తగా మ్యారేజ్ చేసుకోబోయే కపుల్స్‌ కు రొమాంటిక్ వెడ్డింగ్ వోట్స్ అంటే ప్రమాణాలు రాసిచ్చే జాబ్ చేస్తుంటుంది. ఇతరుల ప్రేమ కథలకు మాటలు రాసిచ్చే లూ లైఫ్‌ లో మాత్రం లవ్ జీరో అయిపోతుంది. ఇదే టైమ్‌ లో డాష్ అనే హ్యాండ్సమ్ గై ఆమెకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. లూ కూడా గతాన్ని మర్చిపోయి లైఫ్‌ లో ముందుకు వెళ్లాలని చూస్తుంది.

Advertisement

సరిగ్గా అప్పుడే ఆమె కాలేజీ డేస్ బాయ్‌ఫ్రెండ్, తన ఫస్ట్ లవ్ అయిన వారెన్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే, వారెన్ వేరే అమ్మాయి ఒలివియాను పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతేకాదు, ఆశ్చర్యకరంగా ఆ ఒలివియానే తన వెడ్డింగ్ వోట్స్ రాయమని లూను అప్రోచ్ అవుతుంది. ఎవరినైతే తను ప్రాణంగా ప్రేమించిందో, వాడి పెళ్లికి తనే స్వయంగా లెటర్స్ రాసివ్వాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. ఈ ప్రాసెస్‌ లో లూ తీసుకునే డెసిషన్స్, మాజీ లవర్‌ ను ఇబ్బంది పెట్టడానికి ఆమె వేసే ప్లాన్స్ సినిమాను చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా రన్ చేస్తాయి. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది ? దానికి మాజీ లవర్ రియాక్షన్ ఏంటి ? చివరికి ఆ పెళ్లి జరిగిందా లేదా ? అన్నది మూవీ కథ.

ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ ?

‘లవ్ లాంగ్వేజ్’ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. అయితే ఇది రెంటల్ మోడ్‌ లో ఉంది. సినిమా చూడాలంటే అద్దె కట్టాల్సిందే అన్నమాట. జోయ్ పవర్ ఈ క్యూట్ రొ-కామ్ మూవీని చాలా ఎంటర్‌టైనింగ్ గా తెరకెక్కించారు.

Advertisement

Read Also: కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

Related News

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్‌

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ

కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

పారిపోయిన హీరోపై హత్యా నేరం… చనిపోయాడనుకున్న వాడు తిరిగొస్తే… శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రివేంజ్

Big Stories

Advertisement
×