E-Paper
Advertisement

మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివాదం.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం!

మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివాదం.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం!
Advertisement

Supreme Court: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మహారాష్ట్రలో చేపట్టిన ఎస్​ఐఆర్​ ప్రక్రియలో క్లెయిమ్​ లు, అభ్యంతరాల దాఖలుకు తుది గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మహారాష్ట్రలో జరుపుతున్న ఎస్​ఐఆర్​ లో దాదాపు 33శాతం మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారంటూ అరుణ్​ ఆనందగిరి అనే వ్యక్తి పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ జోయ్​ మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ.మోమనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Also Read: మన ఆటోను వదల్లేకపోయారు.. ఏకంగా సముద్రం దాటించి బ్రిటన్‌కు తీసుకెళ్లారు!

Advertisement

పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్​ అరవింద్ దాతార వాదనలు వినిపించారు. ముంబై, పూణె నగరాల్లో దాదాపు మూడున్నర వేల పునరాభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నట్టు తెలిపారు. పాత కాలనీల కూల్చివేతల వల్ల వేలాదిమంది వేరే ప్రాంతాలకు తర​లి వెళ్లిపోయినట్టు చెప్పారు. చిరునామాల వివరాలు సరిపోవటం లేదన్న కారణంపై వారి పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించే ప్రమాదం ఉందన్నారు. నేటితో ముగియనున్న క్లెయిమ్​ లు, అభ్యంతరాల గడువును పొడిగించాలని కోరారు. ఈ మేరకు తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. కాగా, ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: మొన్నటిదాకా మేం ప్రయత్నం చేసినం.. సాధ్యమే కాలేదన్న హరీశ్‌! అక్కడ నీళ్లే లేవు.. అందుకే మేడిగడ్డకు మార్చామని వాదన!

Tags

Related News

“శరణమా? మరణమా?.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక!

తమిళనాడులో సంచలనం.. అవినీతి కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్ అరెస్టు

భారత్‌లో మారిన బంగారం దిగుమతుల మ్యాప్.. జోరందుకున్న దుబాయ్ రూట్!

ధనుష్‌తో అమిత్ షా ‘ఆపరేషన్-డి’.. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఎటాక్!

AIADMK ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ పిటిషన్ కొట్టివేత!

హోటల్ గదిలో నవ వధువు మృతి.. 6 సెకన్లు ఏం జరిగింది? సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..

Big Stories

Advertisement
×