E-Paper
Advertisement

OTT Movies: సంక్రాంతి సినిమాలకు ఓటిటి డీల్స్ అయిపోయినట్టే, కంప్లీట్ డీటెయిల్స్

OTT Movies: సంక్రాంతి సినిమాలకు ఓటిటి డీల్స్ అయిపోయినట్టే, కంప్లీట్ డీటెయిల్స్
Advertisement

Sankranti Movies OTT: మామూలు సీజన్స్ కంటే కూడా సంక్రాంతి సీజన్ లో ఎక్కువగా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. సంక్రాంతి సీజన్ లో సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అందుకనే చాలామంది దర్శక నిర్మాతలు సంక్రాంతి సీజన్లు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రీ ప్లాన్ గా ఉంటారు. ముఖ్యంగా తెలుగు అగ్రనపమాత దిల్ రాజు సంక్రాంతి సీజన్ లో తన సినిమా ఉండేటట్టు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు. 2025 సంక్రాంతి కానుకగా దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. దానిలో గేమ్ చేంజర్ సినిమా ఊహించిన రేంజ్ లో ఆడలేదు కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ సక్సెస్ అయింది.

అన్ని ఓటీటీ డీల్స్ అయిపోయినట్లే

గేమ్ చేంజర్ సినిమా తీసుకొచ్చిన నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం సినిమా భర్తీ చేసింది. అలానే అనిల్ రావిపూడి కూడా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే పనులు పెట్టుకుంటాడు. ఇక ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి సంక్రాంతికి ముందుకు రానున్నాడు అనిల్. సంక్రాంతి బరిలో మొదటి రిలీజ్ అయ్యే సినిమా ది రాజా సాబ్. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాను జియో హాట్ స్టార్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న సినిమా జననాయగన్ ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

బాక్సాఫీస్ సక్సెస్ అవసరం

Advertisement

రాజా సాబ్ తో పాటు ఈ సినిమా జనవరి 9న విడుదలవుతుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుక్కుంది. ఈ సినిమాతో పాటు శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. అలానే రవితేజ నటిస్తున్న భక్త మహాశయులకు విజ్ఞప్తి ఈ రెండు సినిమాల హక్కులును కూడా జీ ఫైవ్ సొంతం చేసుకుంది. ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read: Tollywood Hero’s: రూపాయి భారీ పతనం.. మన హీరోలే కారణమా?

Advertisement

అలానే సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమా పరాశక్తి. ఈ సినిమాలను నెట్ఫ్లిక్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోయే సినిమాలకు ఓటీటీ బిజినెస్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించాల్సి ఉంది. ముఖ్యంగా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాజా సాబ్ సినిమా మీద కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా అనగనగా ఒక రాజు సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి అని కొంతమంది సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×