E-Paper
Advertisement

Tollywood Hero’s: రూపాయి భారీ పతనం.. మన హీరోలే కారణమా?

Tollywood Hero’s: రూపాయి భారీ పతనం.. మన హీరోలే కారణమా?
Advertisement

Tollywood Hero’s-Indian Rupee Fall: రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్‌ డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో మన రూపాయి విలువ భారీగా పడిపోతుంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా రూ.90 దాటింది. డాలర్‌పై మన రూపాయి అత్యంత కనిష్ట స్థాయిలోకి పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. మంగళవారం ఒక డాలర్‌కు రూ.89.9475 ఉండగా.. బుధవారం ట్రేడింగ్‌ ఒకానొక దశలో రూ.90.30కు పడిపోయింది. చివరకు రూ.90.15 వద్ద స్థిరపడింది. కొంతకాలంగా మనదేశంలోకి విదేశీ వ్యవస్థాగత పెట్టుబడుల రాక తగ్గిందని, అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎఫ్‌ఐఐలను విదేశీ మదుపరులు వెనక్కి తీసేసుకుంటుండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

రూపాయి పతనంపై నా అన్వేషణ రియాక్షన్‌

దీని ప్రకారం.. మనదేశ ప్రొడక్టివిటీ తగ్గి.. విదేశీ వస్తువులు వాడకం పెరగడమే కారణమని అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ రూపాయి పతనాకి కారణం మన ఇండియన్‌ సెలబ్రిటీలే అంటూ కొందరు పెద్ద చర్చ చేస్తున్నారు. అయితే మన రూపాయిని బలపరిచడానికి సోషల్‌ మీడియా స్టార్‌ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ కొన్ని సూచనలు ఇచ్చాడు. మన తెలుగు హీరోల వల్లే రూపాయి బలహీన పడిందని, వారు తలుచుకుంటే మన రూపాయిని తిరిగి బలపరోచ్చంటూ తన యూట్యూబ్‌లో వీడియో షేర్‌ చేశాడు. ఇంతకి ఈ ప్రపంచయాత్రికుడు ఏమంటున్నాడంటే.. గత ఏడాది డాలర్‌ విలువ 85 రూపాయలు ఉండేది. కానీ, ఈసారి కనివీని ఎరుగని రీతిలో గరిష్టం రూ. 90 దాటింది. వచ్చే ఏడాది డాలర్‌ విలువ సెంచర్‌ కొట్టిన కొడుతుంది. అంత దాటకుండ ఆపాల్సిన బాధ్యత మనది. దానికి మన హీరోలందరి సహాకారం ఉంటే డాలర్‌ విలువ పెరగకుండ చూసుకోవచ్చు.

Advertisement

Also Read: Akhanda 2 Release : చర్చలు ఫెయిల్.. ‘అఖండ 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఇదేై!

దానివల్లే డాలర్‌ బలపడుతుంది

డాలర్‌ రేటు పెరగడానికి ప్రధాన కారణం విదేశీ బ్రాండ్‌ల వాడకం, ఫుడ్‌, బంగారం, పెట్రోల్‌. బంగారం, పెట్రోల్‌ రేట్స్‌ మన చేతిల్లో లేవు. కానీ, ఫుడ్‌లో మనం విదేశీ వాడకాన్ని తగ్గించొచ్చు. విదేశీ బ్రాండ్స్ కంటే మన దేశ వస్తువుల వాడకాన్ని పెంచాలి. దానికి మన తెలుగు హీరోలే ముందుకు రావాలి. వారి పేర్లతో ఇక్కడ సమోసా, డ్రీంక్స్‌, పండ్ల రసాల బ్రాండ్‌లను మొదలు పెట్టారు. వపన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు వంటి మన హీరో మన దేశ ఉత్పత్తులపై ఫ్రాంచైజ్‌లు పెట్టాలి. సమోసా, టీ స్టాల్‌, చెరుకు రసం వంటి దేశియ ఉత్పత్తులతో రెస్టారెంట్స్‌, స్టాల్స్ పెట్టి ఫ్రాంచైజ్‌లు అభివృద్ధి చేస్తే మన హీరో బ్రాండ్‌ అని మనవాళ్లు వాటినే తినడానికి ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కొ హీరో తమ పేర్లతో బ్రాండ్‌లను లాంచ్‌ చేస్తే విదేశీ ఉత్పత్తు తగ్గి.. మన దేశ ఉత్పత్తుల వాడకం పెరుగుతుంది.

హీరోలు సమోసా, టీ స్టాల్‌తో..

Advertisement

ఇలా చేస్తే మూడు నెలల్లో డాలర్‌ విలువని పడిపోయేలా చేయొచ్చు. కానీ మనవాళ్లంత బీఎస్సీ చికెన్‌, మొజిల్లా బర్కర్‌ అంటూ విదేశీ ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తున్నారు. అంతేకాదు మన దేశ ఉత్పత్తుల వాడకంపై మన హీరోలు కూడా ఒకరి ఒకరు ఛాలేంజ్‌ చేసుకోవాలి. మన ఇండియన్‌ బ్రాండ్‌ ఖాదీ ఉత్పత్తులు వాడుతున్నాం, మేడ్‌ ఇన్‌ ఇండియా టి-షర్టులు వాడుతున్నా అంటూ ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు ఇలా ఒకరికి ఛాలేంజ్‌ విసురుకుంటే.. మన ఇండియన్స్‌ కూడా మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులకే ఎక్కువ మొగ్గు చూపుతారు. రూపాయి పతనంపై స్పందించి మన తెలుగు హీరోలంత పూనుకుని ఇండియన్‌ బ్రాండ్స్‌ని ప్రమోట్‌ చేస్తే మూడు కాదు రెండు నెలల్లోనే ఈజీగా డాలర్‌ విలువను పతనం చేసి.. రూపాయి విలువను పెంచుకోవచ్చు అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×