E-Paper
Advertisement

Dhurandhar OTT : థియేటర్లలో దుమ్మురేపుతున్న ‘ధురంధర్’ సినిమా… ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ కాబోతోందంటే?

Dhurandhar OTT : థియేటర్లలో దుమ్మురేపుతున్న ‘ధురంధర్’ సినిమా… ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ కాబోతోందంటే?
Advertisement

Dhurandhar OTT : ఈ మధ్య ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా రణవీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా కోసం ఎదురు చూశారు. ఆ రోజు కూడా రానే వచ్చింది. ఇది థియేటర్లలో ఈ రోజు (డిసెంబర్ 5) నుంచి సందడి చేస్తోంది. సంజయ్ దత్ లాంటి లెజెండ్స్ కూడా ఇందులో నటిస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. అప్పుడే ఓటీటీ ఆడియన్స్ ఎందులోకి వస్తుందో అని ఎదురుచూపులు మొదలెట్టారు. టీజర్, ట్రైలర్ లతోనే ఈ సినిమా సంచలనంగా మారింది. రణ్‌వీర్‌ను స్పై ఏజెంట్ పాత్రలో చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో స్టార్ నటులు ఉండటంతో ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా బజ్ ఉంది. ఇక ఈ సినిమా ఓటీటీ వివరాల గురించి తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ స్పై-థ్రిల్లర్ ‘ధురంధర్’ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రణ్‌వీర్‌, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటి సారా అర్జున్ రణ్‌వీర్ సరసన నటిస్తోంది. ఇందులో సారా ప్రధాన పాత్రలో తొలిసారిగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం హక్కులను పొందినట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత వచ్చే ఏడాది ఆదిత్య ధార్ ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు ఇంకా ఎటువంటి సమాచారం విడుదల చేయనప్పటికీ, ఈ చిత్రం 2026 జనవరి 30న డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read Also : పోలీసులకు హింట్ ఇస్తూ మర్డర్లు… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

అజయ్ ధవలే (రణ్‌వీర్ సింగ్) అనే ఆర్మీ ఆఫీసర్ కాశ్మీర్‌లో టెర్రర్ అటాక్‌లో తన ఫ్యామిలీని కోల్పోతాడు. ఆ దెబ్బ నుంచి కోలుకుని రా (RAW)లో జాయిన్ అవుతాడు. తరువాత పాకిస్తాన్ అండర్‌వరల్డ్ మాఫియా ఇండియాలో పెద్ద బాంబ్ అటాక్స్ ప్లాన్ చేస్తున్నారని రిపోర్ట్ వస్తుంది. మాఫియా బాస్ (అర్జున్ రాంపాల్) ఇండియా-పాక్ బార్డర్‌లో డ్రగ్స్, టెర్రర్ కి ఫైనాన్స్ నడిపే బిగ్ షాట్. అజయ్ ముంబై అండర్‌వరల్డ్ నుంచి ఒక స్మగ్లర్‌గా పాక్ కి ఎంట్రీ ఇస్తాడు. ఖాన్ గ్రూప్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ సారా అర్జున్ ప్లే చేసే నీలా అనే ఫీమేల్ ఏజెంట్ అతని పార్ట్‌నర్ గా ఉంటుంది. ఇద్దరూ కలిసి మాఫియా బాస్ సీక్రెట్స్ కలెక్ట్ చేస్తారు. అయితే అజయ్‌ ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది. దీంతో యాక్షన్ సీన్స్ షురూ అవుతాయి. చివరికి అజయ్ మాఫియా బాస్ ని ఎలా ఎదుర్కొంటాడు ? అతన్ని అరెస్ట్ చేస్తాడా ? అజయ్ ఈ మిషన్ ని ఎలా కంప్లీట్ చేస్తాడు ? అనే విషయాలను, ఈ స్పై-థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×