E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్… ముగ్గురమ్మాయిల రచ్చ… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?

OTT Movie : ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్… ముగ్గురమ్మాయిల రచ్చ… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?
Advertisement

OTT Movie : ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. రొమాంటిక్ ఆడియన్స్ దీనిని తెగ చూసేస్తున్నారు. 2021లో వచ్చిన ‘3 రోజెస్’ కు ఇది సీక్వెల్ గా వచ్చింది. అందాల ఆరబోతలో ఈ సిరీస్ కాస్త ఘాటు ఎక్కువగానే పెంచింది. అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముంబై నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ముగ్గురు అందాల భామల ఈ రొమాంటిక్ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

కిరణ్ కె కరవల్ల దర్శకత్వంలో వచ్చిన ‘3 రోజెస్’ 2 (3 roses 2) సిరీస్ 2025 డిసెంబర్ 13 నుంచి ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో
ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, సత్య, ప్రభాస్ శ్రీను, ఇనయా సుల్తానా లీడ్ రోల్స్ లో నటించారు. ఎస్‌కేఎన్ ప్రసాద్ దీనిని నిర్మించారు. 2021లో వచ్చిన పార్ట్ 1కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తరువాత ఇప్పుడు వచ్చిన పార్ట్ 2లో నాలుగు ఎపిసోడ్స్‌ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతా ఎపిసోడ్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also : కోరిక తీర్చలేని మొగుడు… రాత్రైతే రెచ్చిపోయే భార్య… రాధికా ఆప్టే మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్

స్టోరీ ఏమిటంటే

ముంబైలో రీతూ, మేఘన, సృష్టి అనే ముగ్గురు స్నేహితులు ఒక అపార్ట్మెంట్ లో లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ ఉంటుంది. లవ్ ఫైల్యూర్ అయిన రీతూ, విడాకులు తీసుకున్న మేఘన, కొత్తగా డేటింగ్ మొదలెట్టే సృష్టి జీవితాలు ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఈ సమయంలో ముగ్గురు కలసి ఒక కొత్త యాడ్ ఏజెన్సీ మొదలు పెడతారు. వీళ్ళు దీంట్లో సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అది అనుకున్నంత తేలిగ్గా ముందుకు సాగదు. కష్టమర్లు రాకపోవడంతో డీలా పడతారు. అయితే రీతూ బ్రేక్ అప్ చెప్పిన వ్యక్తి వాళ్ళకు ఒక యాడ్ ఇవ్వడానికి వస్తాడు. దీంతో స్టోరీ మలుపులు తిరుగుతుంది. ఆ యాడ్ ని వీళ్ళు కంప్లీట్ చేస్తారా ? వీళ్ళ కెరీర్ గాడిన పడుతుందా ? ఈ ముగ్గురి జీవితాల్లో మగ తోడు దొరుకుతుందా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

 

 

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×