E-Paper
Advertisement

OTT Movie : తెలుగులో ఇలాంటి సినిమానా ? మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమా

OTT Movie : తెలుగులో ఇలాంటి సినిమానా ? మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమా
Advertisement

OTT Movie : ఓటీటీలో వేడి పుట్టించే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కొంచెం స్పెషల్. ఎందుకంటే అప్పటిదాకా ఫ్యామిలీ డ్రామాలతో ఓ రేంజ్ లో ఉన్న ఎం.ఎస్. రాజు, చాలా కాలం తర్వాత బో*ల్డ్ జానర్‌లో ట్రై చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమా హాలీవుడ్ ఫిల్మ్ ‘మ్యాచ్ పాయింట్’ ఆధారంగా తెరకెక్కింది. బాక్సాఫీస్‌లో ఇది యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఓటీటీలో యూత్ ఆడియన్స్‌కు పాపులర్ అయింది. ఈ బో*ల్డ్ సినిమాని ఒంటరిగానే చూడాల్సి ఉంటుంది. హద్దులు దాటే కంటెంట్ ఉంటుంది.  ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ తెలుగు ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డర్టీ హరి’ (Dirty Hari). 2020లో వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 డిసెంబర్ 18న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా aha ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో తెలుగు, తమిళ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : ట్యాక్సీ డ్రైవర్‌తో కిలాడీ లేడీ… అడ్డమైన పనులన్నీ అతడితోనే… ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

హరి అనే యువకుడు చెస్ ప్లేయర్‌గా హైదరాబాద్‌కు వస్తాడు. జీవితంలో సక్సెస్ కావాలని, రిచ్ లైఫ్ గడపాలని కోరుకుంటాడు. అక్కడ వసుధ అనే రిచ్ అమ్మాయిని కలుస్తాడు. హరి ఆమెను ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె డబ్బు, స్టేటస్ తో జల్సాలు చేస్తాడు. పెళ్లి తర్వాత కూడా హరి సంతోషంగా ఉండడు. ఎందుకంటే అతనికి రొమాంటిక్ లైఫ్‌లో సంతృప్తి లేదు. అదే సమయంలో వసుధ సోదరుడు ఆకాష్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ ను చూసి ఆకర్షితుడవుతాడు. ఆమెతో హరి అఫైర్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఇంటెన్స్ ప్యాషనేట్ రిలేషన్ ఏర్పడుతుంది.

Advertisement

పెళ్లి అయిన తర్వాత కూడా హరి జాస్మిన్‌ను వదలడు. ఇద్దరినీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సమస్యలు మొదలవుతాయి. జాస్మిన్ ప్రెగ్నెంట్ అవుతుంది, హరి భయపడతాడు. క్లైమాక్స్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది. ఈ సీక్రెట్ బయటపడకుండా ఉండేందుకు హరి ఏం చేస్తాడు? వసుధకు భర్త అఫైర్ తెలిస్తే ఏమవుతుంది? క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×