Sathi Leelavathi movie : సాధారణంగా సినిమాల్లో భర్త భార్య మధ్య గొడవలు, అపార్థాలు, విడాకుల డ్రామాలు చాలానే చూశాం. కానీ ఒక భర్త తన భార్యకు విడాకులు కావాలని చెబితే, ఆమె ఏకంగా అతడినే కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? అదే సమయంలో కథలో కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలిసి వస్తే మరింత మజా కదా.. అలాంటి వెరైటీ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు చిత్రం సతీ లీలావతి (Sathi leelavathi).
2026లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మొదటి నుంచే తన విభిన్నమైన కథతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే ఘటనలను సరదాగా చూపిస్తూ, కుటుంబ బంధాల విలువను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. కథలో ఒక సాధారణ దంపతుల జీవితమే ప్రధాన అంశం. బయటకు చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించినా, వారి మధ్య క్రమంగా దూరం పెరుగుతుంది. ఒక దశలో భర్త ఇక కలిసి జీవించడం సాధ్యం కాదని భావించి విడాకులు కావాలని నిర్ణయించుకుంటాడు. అయితే అక్కడి నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
విడాకులు ఇచ్చి భర్తను వదిలేయడం బదులు, అతన్ని తిరిగి తన జీవితంలోకి తీసుకురావాలని భార్య ఒక విచిత్రమైన ప్రణాళిక వేస్తుంది. ఆ ప్రణాళికలో భాగంగానే భర్తను కిడ్నాప్ చేసే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి మొదలయ్యే ఘటనలు నవ్వులు పంచడమే కాదు, వారి సంబంధంలో దాగి ఉన్న భావోద్వేగాలను కూడా బయటకు తీసుకొస్తాయి. సినిమా బలం దాని కామెడీ. పరిస్థితుల వల్ల పుట్టే హాస్యం చాలా చోట్ల బాగా వర్కౌట్ అవుతుంది. అదే సమయంలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, కోపం, బాధ, అహం లాంటి భావోద్వేగాలను కూడా సహజంగా చూపించారు. అందుకే ఇది కేవలం కామెడీ సినిమా కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామాగా మారింది.
ముఖ్యంగా పెళ్లి తర్వాత దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు ఎలా పెద్దవిగా మారతాయో, మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే విషయాలు ఎలా సంబంధాలను దెబ్బతీస్తాయో కథలో చూపించారు. అందుకే ఈ సినిమా వినోదంతో పాటు ఒక చిన్న సందేశాన్ని కూడా అందిస్తుంది. జియోహాట్ స్టార్ అందుబాబాటులో ఉన్న సతీ లీలావతి, లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. విడాకుల డ్రామాతో మొదలై కిడ్నాప్ కామెడీగా మారి, చివరికి కుటుంబ బంధాల విలువను గుర్తు చేసే ఈ సినిమా వీకెండ్ వాచ్‌కు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
Read Also : 44కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న మూవీ… రన్ టైమ్ 20 నిమిషాలే