E-Paper
Advertisement

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్
Advertisement

Horror Comedy OTT : దెయ్యం సినిమా అంటే చీకటి గదులు, వింత శబ్దాలు, ఒక్కసారిగా కనిపించే ఆత్మలు.. ఇదే రొటీన్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొన్ని సినిమాలు భయపెట్టడానికి వచ్చినా.. మరికొన్ని ఆ భయాన్నే పంచ్‌లుగా మార్చి ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఫ్రాంచైజీ ‘స్కేరీ మూవీ’ (Scary Movie). హారర్ సినిమాల్లో కనిపించే భయంకరమైన సన్నివేశాలను తీసుకుని, వాటిని పూర్తిగా కామెడీ యాంగిల్‌లో చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఇప్పుడు ఇదే ఫార్ములాతో చాలా ఏళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘Scary Movie 6’. పాత ముఖాలు, కొత్త తరం హారర్ సినిమాలపై సెటైర్లు, మధ్యలో ఊహించని కామెడీ… ఇలా ఈసారి కూడా నవ్వుల విందు సిద్ధం చేసింది. మరి ఈ కొత్త కథలోకి పాత గ్యాంగ్ ఎలా వచ్చింది ? ఈసారి వాళ్లను వెంటాడుతున్న ముసుగు మనిషి ఎవరు ? అసలు ఈ హత్యల వెనుక ఉన్న కథేంటి? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథలోకి వెళ్తే…

కథ మొదలయ్యే సమయానికి గతంలో జరిగిన భయానక సంఘటనలకు చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఒకప్పుడు మాస్క్ పెట్టుకున్న కిల్లర్‌ నుంచి ప్రాణాలతో బయటపడిన సిండి, బ్రెండా, షార్టీ, రే.. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్లు సెటిల్ అయిపోతారు. అప్పటి సంఘటనలు వాళ్లకు ఒక పాత జ్ఞాపకంలా మాత్రమే మిగిలిపోతాయి. కానీ ప్రశాంతంగా సాగుతున్న ఈ జీవితాల్లోకి మరోసారి ఒక మిస్టరీ దూసుకొస్తుంది.

Advertisement

ఒక కొత్త మాస్క్‌డ్ కిల్లర్ వరుసగా దాడులకు పాల్పడటం మొదలుపెడతాడు. పరిస్థితులు ఒక్కొక్కటిగా తీవ్రంగా మారడంతో విడిపోయిన పాత స్నేహితులు మళ్లీ ఒకే చోటికి చేరాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి సినిమా అసలు ఆట మొదలవుతుంది. సాధారణ హారర్ సినిమాలో కిల్లర్ కనిపించిన వెంటనే ప్రేక్షకులు భయపడతారు. కానీ ఇందులో మాత్రం అదే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. కిల్లర్ ఎంతో సీరియస్‌గా భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటే.. అతని ఎదురుగా ఉన్న పాత్రల ప్రవర్తన పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా విచిత్రమైన నిర్ణయాలు తీసుకోవడం, భయపడాల్సిన సమయంలో వెర్రి పనులు చేయడం, సీరియస్ డైలాగ్‌లను కామెడీగా మార్చడం ఇలా ప్రతి సందర్భాన్ని పేరడీ టచ్‌తో చూపిస్తారు.

ఈసారి కథలో కొత్త తరం హారర్ సినిమాల ప్రభావం కూడా కనిపిస్తుంది. ‘స్క్రీమ్’, ‘మేగన్’, ‘స్మైల్’, ‘సిన్నర్స్’, ‘వెడ్నెస్‌డే’ వంటి సినిమాలు, పాత్రలు, వాటి చుట్టూ ఏర్పడిన హారర్ పాప్ కల్చర్ ట్రెండ్స్‌ను తమదైన శైలిలో ఆటపట్టిస్తారు. ప్రేక్షకులకు ఇప్పటికే తెలిసిన హారర్ మూమెంట్ ఒకటి తెరపై కనిపించగానే… అది ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాకముందే కామెడీ పంచ్ పడుతుంది. మాస్క్‌డ్ కిల్లర్ చేస్తున్న దాడులకు ఏదైనా పాత సంబంధం ఉందా ? గతంలో జరిగిన ఘటనలతో ఈ కొత్త వ్యవహారానికి లింక్ ఏంటి? పాత గ్యాంగ్‌నే ఎందుకు వెంటాడుతున్నాడు? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలో ఎక్కడ చూడచ్చు ?

‘స్కేరీ మూవీ 6’కి మైఖేల్ టిడెస్ దర్శకత్వం వహించారు. మార్లన్ వయన్స్, షాన్ వయన్స్, అన్నా ఫారిస్, రెజీనా హాల్ వంటి ఫ్రాంచైజీకి పరిచయమైన నటులతో పాటు టెయానా టేలర్, కీనన్ థాంప్సన్, డేవ్ షెరిడన్, చెరి ఓటెరి, డామన్ వయన్స్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. థియేటర్లలో విడుదలైన వెర్షన్ సుమారు గంటన్నర నిడివితో ఉంటుంది. దీనికి అదనంగా పారామౌంట్ ప్లస్ (Paramount+)లో ఎక్స్ టెండెడ్ వెర్షన్ అందుబాటులో ఉంది. జూన్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే… హారర్ సినిమాల్లోని భయాన్ని ఆస్వాదించడంతో పాటు, అదే భయాన్ని కామెడీగా మార్చి నవ్వుకోవచ్చు. కానీ తెలుగులో లేదు.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×