Sci-Fi Films OTT : జేమ్స్ కామెరూన్ గ్రాండ్ విజువల్ స్పెక్టాకిల్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇటీవలే థియేటర్స్‌లో దుమ్ము దులిపేసింది. పాండోరా వరల్డ్, నావి పీపుల్, అద్భుతమైన CGI… అదో ప్రత్యేకమైన ప్రపంచం. ఈ ఫీల్ మళ్లీ కావాలంటే ఇంట్లోనే ఓటీటీలో ఉన్న ఇలాంటి సైన్స్ ఫిక్షన్ జెమ్స్ ను చూస్తే సరిపోతుంది. పైసా ఖర్చు లేకుండా అవతార్ లాంటి విజువల్ వండర్స్, ఫ్యూచరిస్టిక్ థీమ్స్ ఉన్న సినిమాల ఓటీటీలో ఉన్నాయి. వాటిని చూస్తే మైండ్ బ్లో అవుతుంది. మరి ఆ అద్భుతమైన సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన మార్వెల్ హిట్ మూవీ ఇది. స్పేస్ అడ్వెంచర్‌తో హాస్యం మిక్స్ అయ్యి అదుర్స్ అన్పిస్తుంది. స్టార్-లార్డ్ (క్రిస్ ప్రాట్), గమోరా, డ్రాక్స్, రాకెట్, గ్రూట్ టీమ్ గెలాక్సీని సేవ్ చేస్తారు. కలర్‌ఫుల్ ప్లానెట్స్, స్పేస్ షిప్స్ తో ఈ మూవీ విజువల్ ఫీస్ట్. 2014 లో తెరపైకి వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీతో చూడటానికి బెస్ట్ ఆప్షన్. Jio Hotstarలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
డిజిటల్ వరల్డ్‌లో మరో అడ్వెంచర్ ‘ట్రోన్’. సామ్ తన తండ్రిని వెతకడానికి గ్రిడ్‌లోకి వెళ్తాడు. 2010 లో రిలీజ్ అయిన ఈ మూవీలో నియాన్ లైట్స్, లైట్ సైకిల్స్ వంటి విజువల్స్ ఇప్పటికీ అమేజింగ్. మ్యూజిక్ సూపర్. అవతార్ లాంటి ఇమ్మర్సివ్ ఫీల్ ఇస్తుంది ఈ మూవీ. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
డెనిస్ విల్లెన్యూవ్ ఎపిక్ మూవీ ఇది. 2021 లో వచ్చిన ఈ మాస్టర్ పీస్ లో డెజర్ట్ ప్లానెట్ అర్రాకిస్‌లో పాల్ (టిమోతీ చాలమెట్) తన డెస్టినీని కనుగొంటాడు. సాండ్‌వార్మ్స్, ఫ్రెమెన్ పీపుల్ వండర్ అని చెప్పాలి. జెండయా, ఆస్కార్ ఐజాక్ వంటి కాస్ట్ అద్భుతం. ఈ మూవీని Amazon Prime Videoలో చూడవచ్చు.
టామ్ క్రూజ్ నటించిన ‘ఆబ్లివియన్’ 2013లో రిలీజ్ అయ్యింది. 2077లో నాశనమైన భూమిలో టామ్ చేసే అడ్వెంచర్స్ చూడాల్సిందే. డెస్ట్రాయ్డ్ ఎర్త్ వ్యూస్, డ్రోన్స్ వంటి విజువల్స్ టాప్ నాచ్. Netflixలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
నటాలీ పోర్ట్‌మాన్ లీడ్ గా నటించిన ‘అన్నిహిలేషన్’ మైండ్ బెండర్ అని చెప్పవచ్చు. 2018 లో విడుదలైన ఈ సినిమాలో మిస్టీరియస్ “షిమ్మర్” జోన్ లో వింత మ్యూటేషన్స్, హిప్నోటిక్ విజువల్స్ మామూలుగా ఉండవు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అందుబాటులో ఉంది.
Read Also : మనుషుల్ని చంపి మాస్క్ పెట్టే సైకో… హింట్ వదులుతూ హత్యలు… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి బ్రో