Sci -Fi Movies OTT : టైమ్ ట్రావెల్, ప్యారలాల్ యూనివర్స్, స్పేస్ వంటి అంశాలతో రూపొందే సినిమాలు చూడడానికి ఆసక్తికరంగా ఉంటాయి. వినడానికే మోస్ట్ ఇంట్రస్టింగ్ అయిన ఇలాంటి టాపిక్స్ పై సినిమాలు అంటే ఖచ్చితంగా తెరపై మరింత అద్భుతంగా ఉంటాయి. అలాంటి టాప్ 5 విజువల్ వండర్సే ఈరోజు మన మూవీ సజెషన్.
‘ఫ్రీక్వెన్సీ’ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను తన పాత రేడియో ద్వారా 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన తండ్రితో మాట్లాడతాడు. తండ్రిని కాపాడుకోవడానికి అతను సూచనలు ఇస్తూ ఉంటాడు. అవి వర్తమానంలో ఎలాంటి మార్పులు తెచ్చాయనే పాయింట్ తో ఈ స్టోరీ ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ Netflixలో అందుబాటులో ఉంది.
‘ద టైమ్ మెషిన్’ మూవీ 1960లో తెరకెక్కిన అద్భుతం అని చెప్పాలి. ఓ శాస్త్రవేత్త తాను కనిపెట్టిన యంత్రంతో వేల ఏళ్ల భవిష్యత్తులోకి వెళ్తాడు. అక్కడ ‘ఎలోయ్’, ‘మోర్లాక్స్’ అనే రెండు వింత జాతుల మధ్య జరిగే పోరాటాన్ని కళ్లారా చూస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది కథ. ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లో ఉంది.
ఈ జానర్లోనే సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన మూవీ ‘మూన్’. చంద్రుడి మీద ఒంటరిగా మూడేళ్ల పాటు పని చేస్తాడు సామ్ బెల్. అతని పని అక్కడ ముగిసే సమయానికి తనలాగే ఉన్న మరొక వ్యక్తిని చూసి ఖంగు తింటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? అక్కడ ఏం జరుగుతోంది? అనే నిజం అతన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ మూవీ Huluలో స్ట్రీమ్ అవుతోంది.
Also Read : జైలుకెళ్లి మరీ కిల్లర్లతో ఇంటర్వ్యూలు… సైకోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించే గూస్‌బంప్స్ సిరీస్
సినిమా చరిత్రలో డిస్టోపియన్ మాస్టర్ పీస్ గా నిలిచింది ‘1984’ మూవీ. ‘బిగ్ బ్రదర్’ నిఘాలో ఉన్న సమాజంలో మనుషుల ఆలోచనలను ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుంది? స్వేచ్ఛ కోసం ఓ మనిషి చేసిన పోరాటం ఎంత దారుణంగా ముగిసింది? అనేది స్టోరీ. Amazon Prime Video లేదా MUBIలో ఈ మూవీ రెంట్‌కి దొరికే ఛాన్స్ ఉంది.
లో-బడ్జెట్ మైండ్ బెండింగ్ మూవీ ‘కొహెరెన్స్’. ఒకరోజు రాత్రి స్నేహితులు డిన్నర్ కోసం కలిసినప్పుడు ఆకాశంలో ఒక తోకచుక్క కన్పిస్తుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఊహించని వింతలు మొదలవుతాయి. పక్కనే ఉన్న ఇంట్లో కూడా తమలాంటి మనుషులే ఉండడంతో అందరూ షాక్ అవుతారు. ఒకే సమయంలో వేర్వేరు ప్యారలల్ యూనివర్స్‌లు (Parallel Universes) కలిసిపోతే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ కి అంబాటులో ఉంది.