E-Paper
Advertisement

చిట్టీల పేర భారీ మోసం.. కోటీ 50లక్షలు వసూలు చేసి పరారైన దంపతులు!

చిట్టీల పేర భారీ మోసం.. కోటీ 50లక్షలు వసూలు చేసి పరారైన దంపతులు!
Advertisement
Chit Fraud: స్వేచ్ఛ బ్యూరో: కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కదా అని నమ్మి చిట్టీలు వేస్తే కోటీ యాభై లక్షల రూపాయలు వసూలు చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన మీర్​ పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మీర్​ పేట శివనారాయణపురం ప్రాంతంలోని వైష్ణవి కాలనీ వాస్తవ్యులైన సౌజన్య, సురేశ్​ కుమార్​ భార్యాభర్తలు. సురేశ్​ కుమార్​ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఉన్నాడు. ఇదిలా ఉండగా భార్యాభర్తలు కలిసి పదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. లక్ష నుంచి 10లక్షల చిట్టీలను నిర్వహిస్తున్నారు.

అపుడిస్తా.. ఇపుడిస్తా అని..

వ్యాపారం ప్రారంభించిన తరువాత కొంతకాలం సురేశ్ కుమార్​ దంపతులు చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బు ఇవ్వటంతో స్థానికులకు వీరిపై నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో పలువురు 2.50 లక్షల నుంచి 10లక్షల చిట్టీల్లో సభ్యులుగా చేరి డబ్బు కడుతూ వచ్చారు. అయితే, కొన్ని నెలలుగా చిట్టీల గడువు ముగిసినా సురేశ్​ కుమార్​ సభ్యులకు డబ్బు ఇవ్వకుండా అపుడిస్తా.. ఇపుడిస్తా అని కాలం దాటేస్తూ వస్తున్నాడు. గట్టిగా అడిగిన వారికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. ఇలా దాదాపు కోటీ యాభై లక్షలు బాకీ పడ్డ సురేశ్​ తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×