E-Paper
Advertisement

US Embassy in Riyadh: గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ కన్ను.. మంటల్లో అమెరికా ఎంబసీ

US Embassy in Riyadh: గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ కన్ను.. మంటల్లో అమెరికా ఎంబసీ
Advertisement

US Embassy in Riyadh: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మరో నాలుగు వారాలు పాటు ఉంటుందా? నెల రోజులపాటు ప్రజలకు ఇబ్బందులు తప్పవా? అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులకు ధీటుగా ఇరాన్ బదులు ఇస్తోందా? తనకున్న ఆయుధాలతో అమెరికా స్థావరాలున్న ప్రాంతాలను టార్గెట్ చేసిందా? తాజాగా రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది ఇరాన్. దీంతో ఎంబసీ దాదాపు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ కన్ను

గల్ఫ్‌లో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ రూటు మార్చింది. నేరుగా అమెరికా-ఇజ్రాయెల్‌పై తలపడడం లేదు. మధ్యప్రాచ్యంలో ఆ దేశాలకు సంబంధించి స్థావరాలపై దాడులు ఉధృతం చేసింది. ఓ వైపు ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని సైనికులు, ప్రజా ప్రతినిధులు, సైన్యం స్థావరాపై గురిపెట్టింది. మిస్సైళ్ల వర్షం కురుపిస్తోంది.

Advertisement

ఇంకోవైపు అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దృష్టి సారించింది. వాటిని టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తోంది. పరిస్థితి గమనించిన ఇరాన్.. జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలపై దాడులు తీవ్రం చేసింది. ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది.

ఇరాన్ డ్రోన్ల దాడి.. మంటల్లో రియోద్‌లోని అమెరికా ఎంబసీ

Advertisement

తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా రాత్రి వేళ మంటలు చెలరేగాయి. అటువైపు వాహనాల్లో వెళ్లేవారు హడలిపోయారు. ఎంబసీ చుట్టూ దట్టమైన పొగ అలముకుంది. కేవలం రెండు డ్రోన్లతో యూఎస్‌ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ శాఖ తెలిసింది.

భవనానికి స్వల్పంగా నష్టం జరిగినట్టు తెలిపింది. దాడుల నేపథ్యంలో ఎంబసీ కార్యాలయం ఖాళీగా ఉందని తెలిపింది. ఈ దాడుల నేపథ్యంలో జెడ్డా, బహ్రాయిన్‌, రియాద్‌లో అమెరికన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సౌదీ అరేబియాలో అమెరికా ఎంబసీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ALSO READ: అమెరికా-ఇరాన్ మధ్య మాటల వేడి.. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామన్న ట్రంప్

మరోవైపు రియాద్‌లో అమెరికా ఎంబీసీపై డ్రోన్ల దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జరుగుతున్న దాడులతో రాయబార కార్యాలయం అగ్నికి ఆహుతైందని, ఇరాన్‌కు గట్టి బుద్ధి చెబుతామని అన్నారు. ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తామని తేల్చిచెప్పారు.

 

 

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×