E-Paper
Advertisement

Science fiction thriller series: అంతం అంచున ప్రపంచం… ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Science fiction thriller series: అంతం అంచున ప్రపంచం… ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
Advertisement

Science fiction thriller series : ఓటీటీలో అత్యంత ప్రశంసలు పొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘పారడైజ్’. గత ఏడాది ఈ సీజన్ 1 ఎంతటి విజయాన్ని సాధించిందంటే అది అత్యుత్తమ డ్రామా సిరీస్‌గా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ నామినేషన్‌ను కూడా పొందింది. ఇక ఇప్పుడు వచ్చిన సీజన్ 2 కూడా అదే ఊపులో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ ముగింపులోని షాకింగ్ సంఘటనల తర్వాత, ఈ సీజన్ 2 స్టోరీ మొదలవుతుంది.

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

‘పారడైజ్’ (Paradise) సీజన్ 2, 2026న ఫిబ్రవరి 23న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ప్రస్తుతం మొదటి మూడు ఎపిసోడ్‌లు మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ వారానికి ఒకటి చొప్పున విడుదలవుతాయి. ఎపిసోడ్ 1, 2 & 3: ఫిబ్రవరి 23, 2026 విడుదల అవ్వగా, ఎపిసోడ్ 4: మార్చి 2, ఎపిసోడ్ 5: మార్చి 9, ఎపిసోడ్ 6: మార్చి 16, ఎపిసోడ్ 7: మార్చి 23, ఇక చివరిగా ఫైనల్ ఎపిసోడ్ 8 మార్చి 30న విడుదల అవుతుంది. ఈ సీజన్ లో షైలీన్ వుడ్లీ, థామస్ డోహెర్టీ కీలక పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథ స్టార్టింగ్‌లోనే మన హీరో జేవియర్ కాలిన్స్ బంకర్ నుంచి బయటకు వస్తాడు. అసలు ప్రపంచం అంతా నాశనం అయిపోయిందని అనుకుంటారు కానీ, బయట ఇంకా మనుషులు బ్రతికే ఉన్నారని అతనికి అర్థమవుతుంది. తన భార్య టెరీని వెతుక్కుంటూ జేవియర్ గ్రేస్‌ల్యాండ్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి యానీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. బయటి ప్రపంచం ఎంత ప్రమాదకరంగా ఉందో, అక్కడ బ్రతకడానికి ప్రజలు ఎంతలా కష్టపడుతున్నారో ఈ సీజన్‌లో క్లియర్ గా చూపించారు.

మరోవైపు బంకర్ లోపల పరిస్థితులు కూడా అస్సలు బాలేవు. లోపల ఉన్న రాజకీయాలు, రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. అసలు ఈ బంకర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? బయట ఉన్న వాళ్లకి, లోపల ఉన్న వాళ్లకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సీజన్ మెయిన్ సస్పెన్స్. ముఖ్యంగా అలెక్స్ అనే వ్యక్తిని చంపాలనే కొత్త మిషన్ ఈ స్టోరీకి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఆ అలెక్స్ ఎవరో, జేవియర్ తన భార్యను కలుస్తాడో లేదో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Advertisement

Read Also : 70 ఏళ్ల వయసులో విడాకుల కోసం… పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా రొమాంటిక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×