E-Paper
Advertisement

Jagadatri Serials : ‘జగదాత్రి’ సీరియల్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. జనాలను పిచ్చోళ్లను చెయ్యకండి సామీ..

Jagadatri Serials : ‘జగదాత్రి’ సీరియల్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. జనాలను పిచ్చోళ్లను చెయ్యకండి సామీ..
Advertisement

Jagadatri Serials : తెలుగు ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటూ వస్తున్న వాటిల్లో బుల్లితెర సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. సీరియల్స్లలో ట్విస్టులు మామూలుగా ఉండవు.. ఒకప్పుడు కేవలం సాగదీసే స్టోరీలు.. ఏడుపుగొట్టు సీన్లు ఉండేవి. కానీ ఈ మధ్య మాత్రం సీరియల్స్లలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. కళ్ళు చెదిరే ఫైట్ సీన్లు ఉంటున్నాయి.. దాంతో ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సీన్లే కనిపించడంతో జనాలు కూడా వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఒక సీరియల్ ఒక స్టోరీ తో వస్తే మరో సీరియల్ మరో అద్భుతమైన స్టోరీ తో జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇక జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.. పోలీస్ కాప్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని ఎంత బాగా అలరిస్తూ వస్తుందో చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ డైరెక్టర్ తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఈ సీరియల్ సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ని బయటపెట్టారు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు షాక్ అవుతున్నారు.. డైరెక్టర్ రివిల్ చేసిన ఆ స్టోరీ ఏంటో ఒకసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

జగదాత్రి ఫైట్ సీన్ కోసం అన్ని లక్షలా..? 

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. డిఫరెంట్ కాప్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. అయితే ఈ సీరియల్ ఎక్కువగా పోలీసులకు సంబంధించిన స్టోరీ గా ఉంటుంది. సినిమాలను మించిన స్టోరీ గా ఉండడంతో ప్రతి సీను కూడా కాస్త కాస్ట్లీ గానే ఉంటుందని తాజాగా ఈ సీరియల్ డైరెక్టర్ భార్గవ్ అంటున్నారు. ఇక ఇందులో 36 లక్షల విలువైన ఒక ఫైట్ సీన్ కూడా ఉందని ఆయన రివిల్ చేశారు. సినిమాలో ఒక ఫైట్ సీన్ కూడా అంత ఖర్చు అవుతుందో లేదో కానీ సీరియల్ కు మాత్రం అంత ఖర్చు చేయడంపై జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అవును నిజమే అంత ఖర్చు చేయాల్సిన అవసరం అందులో ఏముంది అని చర్చించుకుంటున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ కి ఒక్క సీన్కే అంత ఖర్చు పెట్టడంపై జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి..

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ శ్రీవల్లి ఆస్తులు.. ఒక్క రోజుకు రెమ్యూనరేషన్..?

2వేల ఎపిసోడ్స్ పక్కా..! 

జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో జగదాత్రి సీరియల్ కూడా ఒకటి.. ఇందులో హీరోయిన్ ఒక పోలీస్ కాప్పాత్రలో నటిస్తుంది.. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఆమె చేసే ఉద్యోగం పైనే సీరియల్ స్టోరీ కొనసాగుతుంది. ఇప్పటివరకైతే దాదాపు 800 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్ తాజాగా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. అయితే ఈ స్టోరీ కాస్త విభిన్నంగా ఉండడంతో జనాలు కూడా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు బుల్లితెరపై ఇలాంటి సీరియల్ రానేలేదు.. అయితే ఈ స్టోరీ దాదాపు 2000 ఎపిసోడ్ లకు పైగా ఉండవచ్చునని డైరెక్టర్ భార్గవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి మొత్తానికి ఈ సీరియల్ అన్ని ఎపిసోడ్లు ఉంటుందా లేదా అన్నది చూడాలి…

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×