BigTV English

The Paradise : గ్లింప్స్ రిలీజ్ వెనక ఇంత ప్లాన్ ఉందా..? అందుకే ఆగమేఘాల మీద…

The Paradise : గ్లింప్స్ రిలీజ్ వెనక ఇంత ప్లాన్ ఉందా..? అందుకే ఆగమేఘాల మీద…

The Paradise : నేచురల్ నానిని రఫ్‌గా ఊర మాస్‌గా మోస్ట్ వయోలెంట్ పర్సన్‌గా ది పారడైజ్ మూవీ గ్లింప్స్‌లో చూపించారు. ఓ పచ్చి బూతు పదం కూడా వాడారు. ఇప్పటి వరకు అయితే… ఈ గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచడానికి బాగానే యూజ్ అయ్యాయి. అయితే ఉన్నట్టుండి… ఆగమేఘాల మీద గ్లింప్స్ ఎందుకు రిలీజ్ చేశారు..? అనే డౌట్ ఎవరికీ రాలేదా..?


నిజానికి ఈ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అప్పటికప్పుడు అనుకున్నారట మేకర్స్. దీని వెనక పెద్ద కథ. అందుకు మించిన పెద్ద ప్లాన్ ఉందట. ఆ.. కథ, ఆ.. ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్ధాం…

సాఫ్ట్‌గా, మన పక్కంటి కుర్రాడిలా కనిపించే నానిని మరీ క్రూరంగా చూపించారు ఈ ది పారడైజ్ గ్లింప్స్‌లో. అంతే కాదు… ఓ పచ్చి బూతును కూడా ఈ గ్లింప్స్‌లో చొప్పించారు. దీనిపై కొంత వరకు వ్యతిరేక కామెంట్స్ వచ్చినా… ఆ పచ్చి బూతు వెనకాల ఓ ప్రమాదకరమైన స్టోరీ ఉందని.. అది తెలియాలంటే… సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పుకొచ్చింది మూవీ టీం.


ఇదింత పక్కన పెడితే… ది ప్యారడైజ్ మూవీ గ్లింప్స్‌ను ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణమేంటి ??? అనేది ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందట. అదే… ఓటీటీ, శాటిలైట్ డీల్.

సాధారంగా ఓటీటీ డీల్స్ అన్ని ఇయర్ స్టార్టింగ్‌లో మర్చి నెల చివర వరకు సాగుతాయట. మార్చి అయిపోతే… మళ్లీ ఆ ఓటీటీ డీల్స్ జరగడానికి మరో నాలుగు నెలల టైం పడుతుందట.

ది పారడైజ్ మూవీ భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీకి పెట్టే మొత్తాన్ని ఇప్పుడు ఫైనాన్స్ తీసుకురావడం వల్ల నిర్మాతకు మితిమీరిన భారం అవుతుంది. ఫైనాన్స్ కాకుండా… ఓటీటీ డీల్ చేసుకుంటే… నిర్మాత చేతికి ఓటీటీ రైట్స్ పేరుతో కొంత వరకు డబ్బులు వస్తాయి. వీటితో మిగితా సినిమాను పూర్తి చేయొచ్చు.

అది జరగాలి అంటే… సినిమాపై బజ్ రావాలి. హైప్ రావాలి. అలా రావాలంటే… సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని ఆడియన్స్ కు చూపించాలి. ఆడియన్స్‌కు వచ్చే పాజిటివ్ రియాక్షన్ బట్టి… అక్కడ ఓటీటీ డీల్ జరుగుతుంది.

అలా… ది పారడైజ్ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారట మేకర్స్. ఈ గ్లింప్స్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇది ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ చేయడానికి మరింత యూజ్ అవుతుంది. ఈ గ్లింప్స్ వచ్చిన తర్వాతే నిర్మాతలు ది పారడైజ్ మూవీ ఓటీటీ రైట్స్ కోసం డోర్స్ ఓపెన్ చేశారట. అయితే ఇప్పటి వరకు ది పారడైజ్ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ముందుకు రాలేదని సమాచారం. గ్లింప్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో… నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారట.

నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఈ మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. అందుకే… ఓటీటీ డీల్ తొందర క్లోజ్ చేసి… వచ్చే డబ్బులతో మిగితా సినిమా చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

ఇలా… ఓటీటీ, శాటిలైట్ డీల్ కోసం ఆగమేఘాల మీద రిలీజ్ చేసిన గ్లింప్స్ కి అయితే… మంచి టాకే వచ్చింది. మరీ ఓటీటీ, శాటిలైట్ డీల్ జరుగుతుందా..? ఒక వేళ జరగకపోతే పరిస్థితేంటి..? తర్వాత మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారు అనేది తెలియాలి.

Related News

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : పెళ్ళైనా తీరని కోరిక… భార్యాభర్తలిద్దరిదీ అదే పరిస్థితి… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : డేటింగ్ యాప్ కోసం అమ్మాయి ఆరాటం… కితకితలు పెట్టే కామెడీ రొమాంటిక్ డ్రామా

OTT Movie : ఈ మూవీ ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది ? గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Big Stories

×