BigTV English

Nayanthara: నయనతార బుద్ది మార్చిన ‘అమ్మోరు తల్లి’… ఎప్పుడూ లేని విధంగా..!

Nayanthara: నయనతార బుద్ది మార్చిన ‘అమ్మోరు తల్లి’… ఎప్పుడూ లేని విధంగా..!

Nayanthara.. సౌత్ ‘లేడీ సూపర్ స్టార్’ అనే ట్యాగ్ తో ఇండస్ట్రీలో చలామణి అవుతున్న నయనతార (Nayanthara) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాల అవుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో, వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైతే.. నయనతార మాత్రం ఇప్పటికీ హీరోయిన్గా చలామణి అవుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడిప్పుడే బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టిన ఈమె.. అక్కడ తన సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు.


అలా అయితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

ఇకపోతే సినిమాల ద్వారా ఇంత పాపులారిటీ సొంతం చేసుకున్న నయనతార.. ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేముందు ఆ చిత్ర దర్శక నిర్మాతలకు షరతులు పెడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా విజయవంతం కావాలని మొదట ప్రారంభించే పూజా కార్యక్రమం మొదలు.. సినిమా విడుదల అయ్యేవరకు చేపట్టే ప్రమోషన్స్ కార్యక్రమాలు కానీ, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ , ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు కానీ ఇలా ఏ కార్యక్రమానికి కూడా నయనతార హాజరుకాదు. ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు దర్శక నిర్మాతలతో ఈ ఒప్పందం కూడా తీసుకుంటుంది. ఇక నయనతార భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్ కావడంతో దర్శక నిర్మాతలు కూడా ఈమె చెప్పిందే వినేవారు. దాంతో ఈమెకు చాలా పొగరు అని , సినిమా ఈవెంట్లకు రాదు అని ఎంతోమంది విమర్శలు గుప్పించిన వారు కూడా లేకపోలేదు.


RC 16 Janhvi Kapoor: బర్త్ డే స్పెషల్ పోస్టర్..జాన్వీ చేతిలో బుజ్జి మేకపిల్ల..!

‘అమ్మోరుతల్లి’ పూజా కార్యక్రమంలో సందడి చేసిన నయనతార..

అయితే అలాంటి నయనతార తాజాగా ఒక సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఒక సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో సడన్గా ఈమె బుద్ధి ఇలా మారిపోయింది ఏంటి? అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార తమిళ్లో నటించిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. ఇదే సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి పేరు లభించడంతో.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తీయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే సుందర్ సి (Sundar.C) దర్శకత్వంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ పేరుతో ఈ సినిమాను ప్రారంభించబోతున్నారు. ఇక నిన్న ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నయనతార సందడి చేసింది.నయనతారతో పాటూ రెజీనా (Regina ), మీనా (Meena), కుష్బూ (Kushboo) వంటి స్టార్ కాస్ట్ కూడా కనిపించడంతో ఇంతమంది స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పూజా కార్యక్రమానికి రూ.1 కోటి వరకూ ఖర్చు అయినట్లు సమాచారం. అదే సమయంలో తన సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా నయనతార పాల్గొనడంతో ఆ అమ్మోరు తల్లే ఈమె బుద్ధి మార్చింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×