Online Gambling: ఆన్‌లైన్ గేమ్ చాలా మంది జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. ఆ ఉచ్చు నుంచి బయటపడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బ్రాండ్ మేనేజర్ ఒకరు. ఆన్‌లైన్ గేమ్ నుంచి బయట పడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు సైతం ఆత్మహత్య చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ పట్టణంలో జరిగింది.
ఇటీవల తెలుగులో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా కొందర్ని బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే జూదం వ్యవసం నుంచి ఎలా బయటపడాలో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. అందులో కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘జూదం ఎంత గొప్పగా ఆడాము అనేది కాదు.. ఎప్పుడు ఆపేమన్నదే ముఖ్యమ’ని హీరోకి తన తండ్రి సలహా ఇచ్చాడు. సరిగా అలాంటి సలహాలు ఇచ్చినవారు లేక, ఆ ఉచ్చు నుంచి బయటకు రాలేక ఈ లోకాన్ని విడిచి పెట్టేస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్ వ్యసనం
తమిళనాడులోని నమక్కల్ పట్టణంలో ప్రేమ్ రాజ్ ఫ్యామిలీ ఉంటోంది. ఆయన ముంబై కేంద్రంగా నడుస్తున్న బీమా బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. కూతురుకి ఆరేళ్లు, కొడుక్కి రెండుళ్లు. ఫ్యామిలీ మొత్తం ప్రేమ్ రాజ్‌కు వచ్చిన జీతంతో జీవితం సాగింది. పిల్లలు చదువుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, చాలని జీతం ఇవన్నీ ఆయన్ని చుట్టుముట్టాయి. దీంతో ప్రేమ్ రాజ్ తన బుర్రకు పదును పెట్టాడు.
ఇలాగైతే జీవితం కష్టమని భావించాడు. చివరకు ఆన్‌లైన్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. మొదట్లో డబ్బులు వస్తాయి.. ఆ తర్వాత మన జేబు ఖాళీ అవుతుంది. ఈ విషయాన్ని ప్రేమ్‌రాజ్ గమనించ లేక పోయాడు. ఒకరోజు కాకపోతే మరో రోజైనా డబ్బులు పస్తాయని ఆశపడ్డాడు. కానీ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఉచ్చులో చిక్కుకున్నానని ఊహించలేకపోయాడు. ఒకటీ రెండు కాదు దాదాపు 50 లక్షలు పోగొట్టుకున్నాడు.
ALSO READ: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్ లో ముగ్గురు మృతి
అప్పుల భారం పెరిగి
అక్కడినుంచి ప్రేమ్‌రాజ్ ఆలోచన మారిపోయింది. 50 లక్షలు అప్పులు, మరోవైపు ఈ ఫ్యామిలీ.. ఈ రెండింటిని నుంచి బయటపడలేకపోయాడు. చివరకు ప్రేమ్‌రాజ్ ఆచూకీ కనిపించలేదు. చివరకు కరూర్ సమీపంలోని పశుపతి పాలాయం వద్ద ప్రేమ్ రాజ్ డెడ్‌బాడీని గుర్తించారు పోలీసులు. బుధవారం రైలు దూకి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ప్రేమ్ రాజ్-మోహన ప్రియ ఉపయోగించిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూసైడ్ లేఖలో తాను ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో ఇరుక్కొన్నానని, రూ.50 లక్షలు పోగొట్టుకున్నానని రాసుకొచ్చాడు. ఈ విషయం ఎవరికీ చెప్పే ధైర్యం లేక, తామంతా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అందులో ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించాలంటూ ఆ లెటర్‌లో పేర్కొన్నాడు ప్రేమ్‌రాజ్.
పోలీసుల విచారణలో
ప్రేమ్ రాజ్ కనిపించకపోవడంతో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులను విచారించారు పోలీసులు. ఇరుగుపొరుగున ఉండే వారితో మాట్లాడారు. త్వరలో డబ్బు వస్తుందని, తిరిగి చెల్లిస్తానన్నానని ప్రేమ్ రాజ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మరుసటి రోజు ప్రేమ్‌రాజ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకీ భార్య, పిల్లలను ప్రేమ్ రాజ్ చంపాడా? వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సివుంది.