E-Paper
Advertisement

Phone Tapping Case: విచారణ చేయడంలో తప్పేం లేదు.. కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

Phone Tapping Case: విచారణ చేయడంలో తప్పేం లేదు.. కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా.. విచారణ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే పార్టీ అంతర్గత పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న తీరును కవిత తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. విచారణ ప్రక్రియను ‘స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్లు ఉంది’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును త్వరగా ముగించాలనే ఉద్దేశంతో లేదని.. కేవలం కాలయాపన చేస్తోందని ఆమె ఆరోపించారు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారనే నమ్మకం తనకు లేదని.. ఇది కేవలం ఒక టైమ్ పాస్ విచారణలా సాగుతోందని వ్యాఖ్యానించారు.

Advertisement

కేసీఆర్‌ను విచారించడంపై స్పందిస్తూ.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి విచారణలను ఎదుర్కోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, విచారణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ విషయంలో తన సోదరుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె విభేదించింది. విచారణకు పిలవడం నేరమని కేటీఆర్ అనడం సరికాదని, విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి అందరూ సహకరించాలని సూచించారు. ఒకవేళ ఈ కేసులో తనను విచారణకు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అన్నింటికంటే ముఖ్యంగా BRS పార్టీ పనితీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు BRSను ఎవరూ బాగు చేయలేరని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అంతర్గతంగా సమీక్షించుకోవాలని, లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్‌ కూడా ట్యాప్ అయి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Advertisement

మొత్తానికి కవిత వ్యాఖ్యలు అటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు సొంత పార్టీలోని లోపాలను ఎత్తిచూపేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గుంటనక్కలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కేసును నీరుగారుస్తోందని ఆరోపిస్తూనే.. విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read: శ్రీలంకలో చిక్కుకున్న 60 మంది తెలుగు పర్యాటకులు.. తిండి, వసతి లేక విలవిల!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×