E-Paper
Advertisement

Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ రైతాంగానికి శుభవార్త..  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన!

Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ రైతాంగానికి శుభవార్త..  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన!
Advertisement

Uttam Kumar Reddy: హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ, పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడంతో, సోమవారం వీటికి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.

మొత్తం ఐదు ప్రధాన ప్రాజెక్టుల కోసం గతంలో ₹447 కోట్లు కేటాయించగా, కాలక్రమేణా పెరిగిన ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఆ మొత్తాన్ని ₹628.78 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మొత్తం 1,58,300 ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ప్రధానంగా జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం ₹173 కోట్ల నుండి ₹292.98 కోట్లకు పెరిగింది. తొలుత 5,650 ఎకరాల కోసం ప్రతిపాదించిన ఈ పథకాన్ని, రైతాంగం విజ్ఞప్తి మేరకు ఇప్పుడు 10,000 ఎకరాలకు విస్తరించారు. దీనివల్ల పాలకీడు మండలంలోని జానపహాడ్, ఆలింగాపురం, బొత్తాలపాలెం వంటి గ్రామాలతో పాటు కొత్తగా యెల్లాపురం, నాగిరెడ్డి గూడెం వంటి ఇతర గ్రామాల రైతులకు కూడా లబ్ధి చేకూరనుంది.

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన పంప్ హౌజ్ పనులు వేగంగా సాగుతున్నాయని, 2026 ఖరీఫ్ నాటికి వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆర్-9 ఎత్తిపోతల పథకం ద్వారా 2,300 ఎకరాలకు నీరందించే పనులకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Advertisement

మరోవైపు, హుజూర్‌నగర్ మరియు కోదాడ పరిధిలోని దాదాపు 1,08,000 ఎకరాలకు జీవనాడి అయిన ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పునరుద్ధరణ మరియు ఆధునీకరణ పనులకు ప్రభుత్వం ₹222.22 కోట్లను మంజూరు చేసింది. దీనితో పాటు సాగర్ ఎడమ కాలువ (NSLBC) లైనింగ్ పనులకు ₹29.02 కోట్లు, జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు ₹53.68 కోట్లు కేటాయించారు.

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ఈ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం సంతృప్తిని ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: మా బట్టలకు మీరేమైనా పైసలిస్తున్నారా?: మహిళా ఐఏఎస్ అధికారుల ట్రోలింగ్‌పై రేణుక చౌదరి ఫైర్!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×