E-Paper
Advertisement

మరోసారి తండ్రి అయిన డైరెక్టర్ అట్లీ.. పోస్ట్ వైరల్!

మరోసారి తండ్రి అయిన డైరెక్టర్ అట్లీ.. పోస్ట్ వైరల్!
Advertisement

Director Atlee:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee ) ఇంట్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చాలా డిఫరెంట్ గా అట్లీ అనౌన్స్ చేయడం గమనార్హం. అట్లీ – ప్రియా మోహన్ దంపతులు సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అట్లీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా యూనిక్ పద్ధతిలో అనౌన్స్ చేశారు. తమ కుమారుడు మీర్ తన చిన్ని చెల్లిని ఆహ్వానిస్తున్నట్లుగా ఫోటో పెట్టి షేర్ చేశారు. తనకు ఇప్పుడు ఒక చెల్లి వచ్చిందని ఒక బుల్లి కారుపై కూర్చున్న మీర్ ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

మరోసారి తల్లిదండ్రులైన అట్లీ – ప్రియ.. సెలబ్రిటీల శుభాకాంక్షలు..

ఇకపోతే ఈసారి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సినీ సెలబ్రిటీలు అట్లీ – ప్రియా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్స్ సమంత, రష్మిక, నిషా అగర్వాల్, కాజల్ అగర్వాల్, అనన్య పాండే తదితర ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాకా టీం నుండి వరుస గుడ్ న్యూస్ లు..

Advertisement

ఇదిలా ఉండగా ప్రస్తుతం అట్లీ ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో రాకా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో అట్లీ ఇంట్లో శుభవార్త నెలకొనడంతో చిత్ర బృందం మొత్తం సంతోషంతో ఎగిరి గంతేస్తోంది. పైగా వరుసగా గుడ్ న్యూస్ లు రాబోతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఈ సినిమా హీరోయిన్ దీపికా పదుకొనే గర్భవతినయ్యాను అని, తన కూతురు దూవా ద్వారా స్పెషల్గా అనౌన్స్మెంట్ చేసింది. ఇక అదే రీతిలో అట్లీ కూడా తండ్రి అయ్యానని చెబుతూ తన కొడుకు చేత స్పెషల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు . అలా మొత్తానికైతే రాకా టీం నుండి అటు హీరోయిన్, డైరెక్టర్ శుభవార్తలు చెప్పడంతో చిత్ర బృందం ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

అట్లీ -ప్రియ ప్రేమ, పెళ్లి, పిల్లలు..

డైరెక్టర్ అట్లీ , నటి ప్రియా ల పెళ్లి విషయానికి వస్తే.. వీరిద్దరిది ప్రేమ వివాహం 2014లో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. సుమారుగా ఎనిమిదేళ్ల తర్వాత 2023లో ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా.. ఇప్పుడు మళ్ళీ మూడేళ్ల తర్వాత రెండో బిడ్డను జీవితంలోకి ఆహ్వానించారు. దీంతో ఈ దంపతుల సంతోషం రెట్టింపు అయింది. మొత్తానికి అయితే మహాలక్ష్మి రాకతో అట్లీ పంట పండింది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అట్లీ సినిమాలు..

Advertisement

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ను మొదలుపెట్టిన అరుణ్ కుమార్ అలియాస్ అట్లీ రాజా రాణి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తేరి ,మెర్సల్, బిగిల్ , జవాన్ వంటి చిత్రాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న అట్లీ.. ఇప్పుడు అల్లు అర్జున్ తో రాకా అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఇది ఒక యోధుడి కథగా.. పగలు మనిషిలా, రాత్రి తోడేలు రూపంలో బన్నీ కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఇది బిగినింగ్ మాత్రమేనని.. అసలు సెలబ్రేషన్స్ ముందుంది అంటూ అట్లీ స్పెషల్ హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది.. అలాగే రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృనాల్ ఠాగూర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ కోలీవుడ్ బడా నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ:ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ మృతి!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×