BigTV English

OTT Movie : పెళ్ళైనా పట్టించుకోని భర్త… రోజుకో మగాడితో ఆ లేడీ కానిస్టేబుల్ చేసే పనికి దిమ్మతిరగాల్సిందే

OTT Movie : పెళ్ళైనా పట్టించుకోని భర్త… రోజుకో మగాడితో ఆ లేడీ కానిస్టేబుల్ చేసే పనికి దిమ్మతిరగాల్సిందే

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. కంటెంట్ కొంచెం నచ్చినా, వదల కుండా చూస్తున్నారు మూవీ లవర్స్. భాషతో ప్రమేయం లేకుండా వీటిని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. సెన్సార్ నిబంధనలు కూడా లేకపోవడంతో, కొన్ని సన్నివేశాలు మరీ ఆరాచకంగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో, ఒక మహిళా కానిస్టేబుల్ డ్రగ్ మాఫియాను పట్టుకునేందుకు వేశ్యలా వెళ్తుంది. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు’షి’ (She). ఇమ్తియాజ్ అలీ, దివ్య జోహ్రీ దీనిని రూపొందించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 2020 మార్చి 20న ప్రీమియర్ అయింది. ఈ సిరీస్‌ కు అరిఫ్ అలీ డైరెక్ట్ చేశారు. ఇది విండో సీట్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మించబడింది. ఇందులో ఆదితి పోహంకర్, విజయ్ వర్మ, విశ్వాస్ కినీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఒక మహిళా కానిస్టేబుల్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె అండర్‌కవర్ మిషన్‌లో ఒక అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ను బస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.ఇది సీజన్ 1 : 2020 మార్చి 20, సీజన్ 2 : 2022 జూన్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)సబ్‌స్క్రిప్షన్‌తో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. సీజన్ 1 – 7 ఎపిసోడ్‌లు, సీజన్ 2 – 7 ఎపిసోడ్‌లు, ప్రతి ఎపిసోడ్ సుమారు 40-50 నిమిషాల నిడివి ఉంది. దీనికి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

భూమికా పర్దేశీ అనే మహిళా ముంబైలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంటుంది. ఈమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. అనారోగ్యంతో ఉన్న తల్లిని, కాలేజ్ కి వెళ్తున్న చెల్లిని తానే చూసుకుంటూ ఉంటుంది. ఆమె భర్త తాగుడుకు బానిస అవ్వడంతో, అతని నుండి విడాకులు తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఆమె జీవితం వ్యక్తిగత సమస్యలతో నడుస్తుంటుంది. ఇది ఇలా ఉంటే, ఒకరోజు భూమి యాంటీ నార్కోటిక్స్ గ్రూప్‌లో చేరి, ఒక ప్రముఖ డ్రగ్ లార్డ్ నాయక్ ని పట్టుకోవడానికి ఒక అండర్‌కవర్ మిషన్‌లో పాల్గొంటుంది. ఈ మిషన్‌లో భాగంగా ఆమె ముంబైలో వేశ్యగా మారువేషంలోకి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె తనలో దాగి ఉన్న కోరికలను, ఇపుడు ఒక ఆయుధంగా ఉపయోగించడం నేర్చుకుంటుంది. ఆమె సస్య ఒక డ్రగ్ డీలర్‌తో సన్నిహిత సంబంధం పెట్టుకుంటుంది. అతను తర్వాత పోలీస్ ఇన్ఫార్మర్‌గా మారతాడు. కానీ భూమితో మాత్రమే సమాచారం పంచుకోవడానికి ఒక షరతు పెడతాడు.

భూమి ఒకవైపు ఆమె వ్యక్తిగత జీవితంలో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, మరోవైపు అండర్‌కవర్ మిషన్‌లో కూడా తన శక్తికి మించి పోరాడుతుంది. ఈ సమయంలో ఆమె తన బాస్ జాసన్ ఫెర్నాండెజ్ ఆదేశాల కింద పనిచేస్తుంది. ఆమె నాయక్‌ అనే మరో గ్యాంగ్ స్టర్ తో సన్నిహితంగా మెలిగి , అతనితో ఉన్నప్పుడు తెలుసుకున్న విషయాలను తన పోలీసు బృందానికి వివరిస్తుంది. కానీ ఆమె ఏదో దాచిపెడుతుందని ఫెర్నాండెజ్ అనుమానిస్తాడు. ఇక అదిరిపోయే క్లైమాక్స్ తో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. చివరికి భూమి ఈ మిషన్ ను కంప్లీట్ చేస్తుందా ? నాయక్‌ చేతిలో చిక్కుకుంటుందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? ఫెర్నాండెజ్ ఆమెను ఎందుకు అనుమానిస్తాడు ? అనే ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ని మిస్ ఆకుండా చూడండి.

Read Also : అబ్బాయిల్ని బోనుల్లో బంధించి అలాంటి పని… ఐఎండీబీలో 7.1 రేటింగ్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

Related News

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

Big Stories

×