OTT Movie : ఓటీటీలో ఒక ఫ్యాంటసీ మూవీ ఆసక్తికరంగా ఉంటోంది. ఇది చందమామ పుస్తకాలలో ఉండే ఒక కథాలా సాగుతుంది. ఈ మూవీలో కాకులుగా మారిన తన ఏడుగురు అన్నలను కాపాడే ప్రయత్నం చేస్తుంది వీళ్ళ చెల్లి. ఆ తరువాత స్టోరీ ఓ లెవెల్ లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే ..
ఆపిల్ టివి (AppleTV) లో
ఈ ఫ్యాంటసీ మూవీ పేరు ‘ది సెవెన్ రావెన్స్’ (The Seven Ravens). 2015 లో వచ్చిన ఈ సినిమాకి ఆలిస్ నెల్లిస్ దర్శకత్వం వహించారు. ఇది బోజెనా నెమ్కోవా కథ ఆధారంగా రూపొందింది. ఇందులో మార్తా ఇస్సోవా, సబీనా రెముండోవా, లుకాస్ ప్రికాజ్కీ, వాక్లావ్ న్యూజిల్ వంటి నటులు నటించారు. ఇది 2015లో విడుదలై, చెక్ లయన్ అవార్డ్స్‌లో ఉత్తమ స్టేజ్ డిజైన్, మేకప్, కాస్ట్యూమ్ డిజైన్‌లలో అవార్డులు గెలుచుకుంది. 1 గంట 37 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 7.1/10 రేటింగ్ ఉంది. ఆపిల్ టివి (AppleTV) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక గ్రామంలో ఉండే దంపతులకు బోహ్దంకా అనే అమ్మాయి జన్మిస్తుంది. బోహ్దంకా బాల్యం నుంచి, తన తల్లిదండ్రులు దిగులుగా ఉండటాన్ని గమనిస్తుంది. అయితే దీనికి కారణం ఆమె పెరిగే వరకు తెలియదు. తనకు ఏడుగురు అన్నలు ఉన్నారని, వాళ్ళు తండ్రి కోపంలో శపించడం వల్ల కాకులుగా (రావెన్స్) మారారనే విషయం రహస్యంగానే ఉంచుతారు ఆమె పేరెంట్స్ . ఇక బోహ్దంకా గ్రామంలో ఆనోటా ఈ నోటా తన అన్నల గురించి రహస్యాన్ని తెలుసుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు ఈ విషాదాన్ని ఆమె నుండి దాచి ఉంటారు. ఎందుకంటే ఆమె పుట్టబోయే సమయంలో జరిగిన సంఘటనలే దీనికి కారణం. బోహ్దంకా జన్మించినప్పుడు, ఆమె బలహీనంగా ఉండటం వల్ల, తండ్రి తన ఏడుగురు కుమారులను ఆమె బాప్టిజం కోసం నీళ్ళు తీసుకురమ్మని పంపుతాడు. కానీ ఆ ఏడుగురు బాలురు హడావిడిలో నీటి కుండను బావిలో పడేస్తారు. కోపంతో తండ్రి వాళ్ళని కాకులుగా మారమని శపిస్తాడు.
ఈ శాపం నిజమై, ఏడుగురు అన్నలు కాకులుగా మారి ఎగిరిపోతారు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న బోహ్దంకా, తన అన్నలను రక్షించాలని నిర్ణయించుకుంటుంది. బోహ్దంకా అడవిలోకి వెళ్లి, గాబ్రియెలా అనే స్థానిక మంత్రగత్తెను కలుస్తుంది. ఆ మంత్రగత్తె తనకి ఒక మాయా దువ్వెన ఇస్తుంది. ఈ దువ్వెన ఒకరి జుట్టులో ఉంచినప్పుడు వారి జ్ఞాపకాలను ఆమె గలదు. బోహ్దంకా ఈ దువ్వెనను ఉపయోగించి తన తల్లి జ్ఞాపకాల ద్వారా శాపం గురించి నిజాన్ని తెలుసుకుంటుంది. మంత్రగత్తె ఆమెకు శాపాన్ని తొలగించే మార్గాన్ని కూడా చెబుతుంది. ఆమె ఏడు సంవత్సరాల పాటు మాట్లాడకుండా, సిరపు గడ్డి నుండి ఏడు చొక్కాలను తయారు చేయాలి. సిరపు గడ్డిని స్వయంగా సేకరించి, నూలుగా మార్చి, బట్టను నేసి, ఎవరి సహాయం లేకుండా ప్రతి కుట్టు స్వయంగా కుట్టాలి.
బోహ్దంకా ఈ కఠినమైన పనిని చేయడానికి, ఒక పర్వత గుహలో ఉంటూ, మౌనంగా చొక్కాలను తయారు చేయడం ప్రారంభిస్తుంది. బోహ్దంకా ఈ పని కొనసాగిస్తున్నప్పుడు, ఆమెను బార్టోలోమెజ్ అనే రాకుమారుడు చూస్తాడు. అతను ఆమె అందానికి మైమరచి, ఆమెను తన రాజ్యంలోని రాజభవనానికి తీసుకెళ్లి, తన సవతి తల్లి అయిన రాణి అలెగ్జాండ్రా ఆమోదం లేకపోయినా బోహ్దంకాను వివాహం చేసుకుంటాడు. అలెగ్జాండ్రా ఆ తరువాత బోహ్దంకా పై కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో క్లైమాక్స్ ఒక ఊహించని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి బోహ్దంకా తన అన్నలకు ఉన్న శాపాన్ని పోగొడుతుందా ? అలెగ్జాండ్రా చేసే కుట్రలు ఏమిటి ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎలాంటిది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఓటీటీలో దుమ్మురేపుతున్న బాలయ్య హీరోయిన్ మూవీ… ఆ సీన్స్ అయితే అరాచకం మావా