Mundari Tribe in South Sudan: అద్భుతమైన కంటెంట్.. అదిరిపోయే ప్రజెంటేషన్.. ప్రపంచ యాత్రికుడి వీడియోల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి బండారాన్ని బయటపెట్టిన అన్వేష్.. ఇప్పుడు అద్భుతమైన ప్రదేశాలను, వింతైన ప్రాంతాలను ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. అందులో భాగంగానే సౌత్ సూడాన్ లోని ముండారీ ఆదివాసీ తెగ గురించి ఆసక్తికర విషయాను వెల్లడించాడు. వేల రూపాయలు ఖర్చు చేసి, చెక్ పోస్టులను దాటుకుంటూ వెళ్లి.. ఈ తెగ జీవన విధానాన్ని చూపించే ప్రయత్నం చేశాడు.
పశు పోషణే ప్రధాన జీవన ఆధారం
ముండారీ ఆదివాసీలు దక్షిణ సూడాన్ లోని చిన్న సమూహం. ఎక్కువగా సెంట్రల్ ఈక్వటోరియా, వెస్ట్రన్ ఈక్వటోరియా ప్రాంతాల్లో నివసిస్తారు. వారి జీవన విధానం గొర్రెలు, మేకలు, ఆవుల పెంపకం చుట్టూ తిరుగుతుంది. ఈ పశువులే వారి సంపద, సామాజిక హోదా, సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నంగా భావిస్తారు. ఆవుల నుంచి పాలు, మూత్రం, పేడను సేకరిస్తారు. గోమూత్రాన్ని ఔషధ గుణాల కోసం స్నానానికి, జుట్టు శుభ్రపరచడానికి, పరానాయిడ్స్‌ను నివారించడానికి, ఎండవేడి, దోమల నుండి రక్షణగా ఉపయోగిస్తారు. పేడను ఇంధనంగా, ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు. వారి సంప్రదాయాలు, ఆచారాలు పశువులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఆవు మూత్రంతో స్నానం చేయడం వల్ల, ఆవు పేడను కాల్చిన బూడిదను ఒంటికి పూసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు రావని ఈ తెగ ప్రజలు నమ్ముతారు.
50 ఆవులను ఇస్తేనే కన్యాదానం
ముండారీ ఆదివాసీలలో పెళ్లిళ్లు కూడా విచిత్రంగా ఉంటాయి. అమ్మాయిని ఇవ్వాలంటే వారి తల్లిదండ్రులకు 50 ఆవులను బహుమతిగా ఇవ్వాలి. అంటే మన దగ్గర వరకట్నం ఉంటే, వారి దగ్గర కన్యాశుల్కం ఉంటుంది. అంటే, ఆవులను ఎదురు కట్నం ఇచ్చి మరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా వీరి జీవన విధానం అంతా ఆవుల చుట్టూనే తిరుగుతుంది. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆవుల పోషణలోనే జీవిస్తారు. కానీ, పెద్దలు, పిల్లలు.. ఎవరికీ సరైన బట్టలు ఉండదు. నీట్ నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అర్థరాత్రి అన్వేష్ ను ఎత్తుకెళ్లిన పోలీసులు
ముండారీ ఆదివాసీల గురించి రెండు రోజుల పాటు గడపాలని వెళ్లిన అన్వేష్ కు అక్కడి పోలీసులు షాకిచ్చారు. అక్కడికి వెళ్లేందుకు అన్ని పర్మీషన్స్ ఉన్నా.. చెక్ పోస్టుల దగ్గర లంచం ఇవ్వాల్సిందే. అలాగే అర్థరాత్రి సమయంలో అన్వేష్ కు అక్కడ ఉండటానికి పర్మీషన్ లేదంటూ తీసుకెళ్తారు. ఎప్పటి లాగే వారికి కాస్త లంచం ముట్టజెప్పడంతో మళ్లీ వదిలేశారు. అలా పోలీసుల నుంచి బయటపడిన ఆన్వేష్ రెండో రోజు కూడా వారితో గడిపి అక్కడి నుంచి బయల్దేరుతాడు. ఈ తెగకు చెందిన ప్రజలు ఇండియాలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిషా, చత్తీస్ గఢ్ సహా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు.
Read Also:చిత్తూరులో రైలు దోపిడీ.. అచ్చం సినిమాల్లో చూపించినట్లే!